Published On:

HIT 4 Movie Update: నాని సినిమాలో మెరిసిన ప్రముఖ హీరో.. ‘హిట్ 4’ హీరో దొరికేశాడా?

HIT 4 Movie Update: నాని సినిమాలో మెరిసిన ప్రముఖ హీరో.. ‘హిట్ 4’ హీరో దొరికేశాడా?

HIT 4 Movie hero Latest Update: నాని హీరోగా నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 3. ఈ సినిమా ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కించగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అయితే ఇందులో ప్రముఖ తమిళ హీరో కార్తి ముఖ్య అతిథి పాత్రలో కనిపించారు. అతడే ‘హిట్ 4’ హీరో అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. డైరెక్టర్ మంచి హింట్ ఇచ్చాడని కామెంట్స్ పెడుతున్నారు.

 

ఇక, ఈ మూవీ హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ, మాస్ ఆడియన్స్‌ను అలరించడంలో డైరెక్టర్ మరోసారి సక్సెస్ అయ్యారు. బాగా పండిందని, ఫస్టాప్ కొంచెం నెమ్మదిగా సాగడం, వయలెన్స్ ఎక్కువగా ఉండడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు.

 

అయితే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో కార్తి క్లైమాక్స్ లో కనిపించి కనువిందు చేశాడు. ఆయన రత్నవేల్ పాండియన్ అనే పోలీస్ అధికారిగా కనిపించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మునుషులోయ్..’ అంటూ తన స్టైల్‌లో గురజాడ అప్పారావు చెప్పిన కవిత్వాన్ని చెబుతూ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను కొంతమంది ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.