Saif Ali Khan: ఆదిపురుష్ వివాదం.. కవర్ చేసినా సెట్ అవ్వలేదు బ్రో.. ?

Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్.. ఆదిపురుష్ వివాదంలో యూ టర్న్ తీసుకున్నాడు. నిన్నటికి నిన్న.. ఆదిపురుష్ తన కొడుక్కి నచ్చలేదని, అందుకే సారీ చెప్పాను అని చెప్పిన సైఫ్.. ఇప్పుడు రివర్స్ గా వేర్ విషయంలో తన కొడుక్కి సారీ అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది అంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్.
మొదటిసారి ప్రభాస్ రాముడిగా కనిపించడం.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం రెండు ఒకేసారి రావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా కనిపించాడు. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా భారీ పరాజయాన్ని అందుకుంది. పరాజయం మాత్రమే కాకుండా ట్రోల్ కంటెంట్ గా మారింది.
ఇప్పటికీ ప్రభాస్.. బాలీవుడ్ అంటేనే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. అంతలా ఆ సినిమాను నాశనం చేశాడు ఓం రౌత్. ఇక ఈ మధ్యనే ఆదిపురుష్ సినిమాను సైఫ్ తన కొడుకు తైమూర్ కు ఆదిపురుష్ సినిమా చూపించాను అని, అతనికి ఆ సినిమా నచ్చలేదని చెప్పాడని.. అందుకు తన కొడుకుకు సారీ చెప్పానని చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఫ్యాన్స్, క్రిటిక్స్, ట్రోలర్స్.. నచ్చలేదన్న సినిమాను.. అందులో నటించిన సైఫ్ కూడా నచ్చలేదు అని చెప్పడం సెన్సేషన్ గా మారింది.
అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. సైఫ్ నేడు ప్లేట్ తిప్పేశాడు. తాను తైమూర్ కి సారీ చెప్పింది.. సినిమా నచ్చలేదని కాదని, వేరే విషయంలో సారీ చెప్పానని చెప్పుకొచ్చాడు. ఆదిపురుష్ లో నేను విలన్ గా చేశాను. యుద్దాలు చేస్తూ.. కేకలు వేస్తూ కనిపించాను. అవి చూసి తైమూర్ ఇలాంటి పాత్రలు చేయొద్దని, హీరోగానే చేయమని అడిగాడు. ఇక ఎప్పుడు ఇలాంటి పాత్రలు చేయనని, హీరోగానే చేస్తాను అని చెప్పాను. నేను నటించిన సినిమాలను గౌరవిస్తాను. ఆదిపురుష్ ని కూడా అలాగే గౌరవిస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్ కవర్ చేసావ్ కానీ సెట్ అవ్వలేదు బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- Samantha: శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ – ‘ఏం మాయ చేశావే’ తర్వాత వైజాగ్ సంఘటన గుర్తు చేసుకుని సామ్ ఎమోషనల్