Ajay Bhupati: ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. మహేష్ బాగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా.. ?

Ajay Bhupati: ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ అజయ్ భూపతి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. అసలు అప్పట్లో ఈ సినిమా క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ ఇంకేదీ చేయలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా తరువాత అజయ్ భూపతిని ఆపడం ఎవరి తరం కాదు అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒకటి.. అయ్యింది ఒకటి.
అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాక అజయ్.. మహా సముద్రం సినిమాతో భారీ పరాజయాన్ని అందుకున్నాడు. శర్వానంద్, సిద్దార్థ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా వలన ఎవరికైనా మంచి జరిగింది అంటే అది సిద్దార్థ్ – అదితి ఈ సినిమా సెట్ లో కలుసుకోవడం.. ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడమే.
ఇక ఈ సినిమా తరువాత అజయ్.. మంగళవారం అంటూ మరో థ్రిల్లర్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఇక ఈ మధ్యనే మంగళవారం 2 సినిమాను అనౌన్స్ చేశాడు అజయ్. ఇది కాకుండా.. అజయ్ భూపతి ఒక పెద్ద బాధ్యతను అందుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే అతన ఫొటోస్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా జయకృష్ణ టాలీవుడ్ ఎంట్రీ బాధ్యతలను అజయ్ భూపతికి అప్పగించినట్లు తెలుస్తోంది. జయకృష్ణకు తగిన కథనే అజయ్ ఎంచుకున్నాడని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నాడని టాక్ నడుస్తోంది. మహేష్ సైతం.. అన్న కొడుకు ఎంట్రీ కోసం బాగానే కష్టపడుతున్నాడట. మరి అజయ్.. ఘట్టమనేని కుటుంబానికి హిట్ ను ఇస్తాడో లేదో చూడాలి.