Samantha: శుభం ప్రీ రిలీజ్ ఈవెంట్ – ‘ఏం మాయ చేశావే’ తర్వాత వైజాగ్ సంఘటన గుర్తు చేసుకుని సామ్ ఎమోషనల్

Samantha Speech At Shubham Pre Release Event: స్టార్ హీరోయిన్ సమంత తీరు చూస్తుంటే ఇక ఆమె నటనకు బ్రేక్ తీసుకునేలా కనిపిస్తోంది. తెలుగులో చివరిగా ఖుషి సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. మయోసైటిస్ కారణంగా సినిమాలకు కాస్తా బ్రేక్ తీసుకుంది. అయితే ఆ బ్రేక్ తర్వాత సామ్ తెలుగులో ఏ సినిమాకు సంతకం చేయలేదు. సిటాడెల్: హనీ బన్నీ షూటింగ్ పూర్తి చేసి, ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ సిరీస్ కూడా విడుదలై నెలలు గడిచింది. ఇక తెలుగు సినిమాలపై ఫోకస్ పెడుతుందనుకుంటే ఆమె నుంచి ఏ ప్రకటన రావడం లేదు. హిందీలో మాత్రం వరుస ప్రాజెక్ట్స్‌కి కమిట్ అవుతుంది.
మరోవైపు నిర్మాతగానూ పరిచయం కాబోతోంది. ఆమె సొంత బ్యానర్‌లో ‘శుభం’ అనే సినిమా రిలీజ్ కాబోతోంది. సమంత నిర్మాతగా వ్యవహరించడమే కాదు.. ఇందులో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇవ్వబోతోంది. మే 9న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. వైజాగ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి నటీనటులు, దర్శకులతో పాటు సమంత కూడా హాజరైంది. ఈ సందర్భంగా సామ్ ఈ కార్యక్రమంలో సమంత తెలుగు మాట్లాడుతూ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆమె వైజాగ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.
“నాకు గుర్తుంది. చాలా రోజుల క్రితం. ఏం మాయ చేశావే సినిమా తర్వాత.. ఈ సినిమా హిట్టా? ఇది జనాలకు నచ్చిందా? అనేది నాకు తెలియదు. ఆడియన్స్‌కి నేను నచ్చానా? ఇవన్ని ఏం తెలియదు. ప్రేక్షకులు ఏం అనుకుంటున్నారని తెలియదు. అదే టైంలో ఏదో మాల్ ఒపెనింగ్‌కి వైజాగ్ అవచ్చాను. అప్పుడు నాకు ప్రేక్షకులు నుంచి ఘన స్వాగతం లభించింది. అప్పుడే నిజమైన ప్రేమను చూశాను. ఎయిర్‌పోర్టు నుంచి మాల్ ఒపెనింగ్ వరకు నిజమైన ప్రేమ, అభిమానం అనుభూతిని పొందాను” అంటూ సమంత చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా సామ్ తెలుగులో క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతూ ఆకట్టుకుంటుంది.
Sam cute Telugu speech about vizag#SubhamPreReleaseEvent #SubhamOnMay9 @Samanthaprabhu2 #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/05vcMM0sVA
— AkaSam (@SammuVerse) May 5, 2025