Published On:

Heera Allegations on Ajith: పనిమనిషి లాంటి స్త్రీతో పెళ్లి, నచ్చిన వారితో శృంగారం – అజిత్‌పై నటి హీరా సంచలన ఆరోపణలు

Heera Allegations on Ajith: పనిమనిషి లాంటి స్త్రీతో పెళ్లి, నచ్చిన వారితో శృంగారం – అజిత్‌పై నటి హీరా సంచలన ఆరోపణలు

Heera Sensational Comments on Ajith Kumar: ఒకప్పటి హీరోయిన్‌ హీరా రాజగోపాల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 90లలో స్టార్‌ హీరోయిన్‌ ఓ వెలుగు వెలిగిన ఆమె తెలుగులో నాగార్జున ‘ఆవిడా మా ఆవిడే’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందింది. తమిళ్‌, తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఆమె ఆ తర్వాత సడెన్‌గా కనుమరుగైంది. ఆమె వెండితెరపై కనిపించి కొన్నేళ్లు అవుతుంది. అయితే తాజాగా ఓ స్టార్‌ హీరోపై సంచలన ఆరోపణలతో తెరపైకి వచ్చింది. ఆయన పేరు చెప్పకుండానే తెరవెనక జరిగిన విషయాన్ని తన వ్లాగ్‌లో రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్స్‌ షాట్స్‌, ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది.

 

1990లో తమిళ స్టార్‌ హీరో అజిత్‌, హీరాలు ప్రేమయాణం నడిపిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు వీరిద్దరు డేటింగ్ చేశారు. ఇక పెళ్లి కూడా చేసుకుంటారని అభిమానులంత ఆశించారు. కానీ ఏమైందో ఏమో వీరి ప్రేమకు ఎండ్‌కార్డు పడింది. ఈ లవ్‌బర్డ్స్‌ విడిపోవడం అప్పట్లో హాట్‌టాపిక్‌ అయ్యింది. వీరిద్దరి బ్రేకప్‌ టైంలో హీరానే అజిత్‌ని మోసం చేసింది, డ్రగ్స్‌ తీసుకుంటుందంటూ ఆమెపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నో ఏళ్ల తర్వాత తనపై వచ్చిన నెగిటివ్‌ కామెంట్స్‌ ఆమె పెదవి విప్పింది. అదీ ఇవాళ అజిత్‌ పద్మ భూషణ్‌ అందుకుంటున్న సమయంలోనే ఆమె నుంచి ఇలాంటి కామెంట్స్‌ రావడం ఇప్పుడ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. అజిత్‌ పేరు చెప్పకుండానే ఆమె తన లవ్‌, బ్రేకప్‌ గురించింది చెప్పంది. అంతేకాదు ఆ నటుడు తనని మోసం చేసి మరో నటిని పెళ్లి చేసుకున్నట్టు వ్లాగ్‌లో పేర్కొంది.

 

“ఒక నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు. కొన్నేళ్ల పాటు మేమిద్దరం రిలేషన్‌ ఉన్నాం. అతనేవరో మీకు కూడా తెలుసు. అయితే ఆ హీరో వల్ల నేను దారుణంగా మోసపోయాను. మేం విడిపోయే టైంలో తన అభిమానులు నాపై వ్యక్తిగత దాడి చేశాడు. ఆ నటుడు నా వ్యక్తిత్వంపై దెబ్బతీసేలా చేశాడు. అతడి వల్ల ఎన్నో అవమానాలు పడ్డాను. డ్రగ్స్‌ ఎడిక్ట్‌కి అయ్యానంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఇలా ఎన్నో ఇబ్బందులు, అవమనాలు ఎదుర్కొన్నాను. మేము రిలేషన్‌లో ఉండగా.. అతడు తన వెన్నుముకకు సర్జరీ చేయించుకున్నట్టు చెప్పాడు. ఆ సమయంలో నేను అతడితోనే ఉండి సపర్యలు చేశాను. కానీ, అతను ఆరోగ్యం విషయంలో కూడా నాతో అబద్ధం చెప్పాడని తెలిసింది” అని రాసుకొచ్చింది. ఆ తర్వాత వివాహంపై అతడి అభిప్రాయాన్ని ఇలా చెప్పినట్టు వెల్లడించింది. “నేను పనిమనిషిలా కనిపించే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే అప్పుడు ఆమెను ఎవరు చూడరు. ఇక నేను నాకు నచ్చిన స్త్రీతో శృంగారంలో పాల్గొంటాన” అని చెప్పినట్టు హీరా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

 

కాగా హీరా-అజిత్‌లు కాథల్‌ కొట్టై అనే సినిమాతో తొలిసారి జంటగా నటించారు. ఆ మూవీ టైంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారు. అలా కొన్నేళ్ల పాటు పీకల్లోతు ప్రేమలో పడిన వీరు కొన్నాళ్లకు బ్రేకప్‌ చెప్పుకున్నారు. అయితే వీరి పెళ్లికి హీరా తల్లి ఒప్పుకోలేదనే ప్రచారం జరిగింది. మరోవైపు అజిత్‌ ఆమెను వదిలించుకున్నాడనే గుసగుస కూడా వినిపించింది. వీరిద్దరి బ్రేకప్‌ తర్వాత అజిత్‌ నటి శాలినిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరిద్దరిది కూడా ప్రేమ వివాహమనే విషయం తెలిసిందే. కెరీర్‌ పీక్‌ టైంలోనే అజిత్‌ పెళ్లి చేసుకున్న శాలిని ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి హౌజ్‌ వైఫ్‌గా సెటిలైపోయింది.