Netizens Fires On Allu Arjun: అల్లు అర్జున్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం – ‘ఫ్యాన్స్ ఆర్మీ’ ఉత్త మాటేనా..

Allu Arjun Rejects Selfie to Fan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అలాగే గత రెండు రోజులుగా బన్నీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు. దీనికి కారణం అతడు ధరించిన టి-షర్టు. ఇటీవల వేవ్స్ సమ్మిట్ 2025 సందర్భంగా ముంబై వెళ్లిన బన్నీ ఎయిర్‌పోర్టులో దర్శనం ఇచ్చాడు. ఈ సందర్భంగా అతడ టి-షర్టుపై ఉన్న ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించింది. అది ఎవరిదో కాదు హాస్య బ్రహ్మా బ్రహ్మనందం ఫోటో కావడం విశేషం.
సత్య మూవీలోని నెల్లూరి పెద్దారెడ్డి తాలుకా డైలాగ్ బ్రహ్మానందం చెప్పే డైలాగ్ సీన్ అది. అందులో ఆయన లుక్‌తో ఉన్న టి-షర్టు ధరించిన బన్నీ హాట్ టాపిక్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే పుష్ప 1, పుష్ప 2 సినిమాలతో నేషనల్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. దీంతో ఆయన సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ ఫుల్ ఫ్యాన్స్ బేస్ పెరిగింది. ఈ క్రమంలో తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించిన అల్లు అర్జున్‌తో సెల్ఫీ కావాలి అడిగాడు ఓ అభిమాని.
అయితే బన్నీ కనీసం అతడిని చూడకుండానే సెల్ఫీకి నిరాకరించాడు. అతడి బౌన్సర్లు ఆ అభిమానిని దూరంగా నెట్టారు. అల్లు అర్జున్‌తో సెల్ఫీ దిగేందుకు సంతోషంగా ముందుకు వచ్చిన వ్యక్తికి నిరాశ ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రముఖ బాలీవుడ్ మీడియాలో తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అభిమాని పట్ల అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ వల్లే ఈరోజు నువ్వు ఈస్థాయిలో ఉన్నావు.. గుర్తు పెట్టుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
“నా ఆర్మీ నా ఆర్మీ అంటూ అభిమానులపై తెగ ప్రేమ ఒలగబోశావ్. అవన్ని మాటలకే పరిమితం. నువ్వేంటో ఈ వీడియోతో అర్థమైంది. జస్ట్ 5 సెకన్ల ఫోటోకు కూడా నీ దగ్గర టైం లేదా? మీ హీరోలకు సినిమా ప్రమోషన్స్ టైంలోనే ఫ్యాన్స్ కావాలి” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘అల్లు అర్జున్ సినిమాలు చూడటం ఆపేయండి’, ‘ఇదేం మొదటి సారి కాదు. నిజానికి అల్లు అర్జున్ ఎప్పుడూ కూడా తన అభిమానులకు సెల్ఫీ ఇచ్చేందుకు ఇష్టపడడు’ అని కామెంట్ చేశారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- Janu Lyri Second Marriage: చనిపోతానంటూ వీడియో.. అంతలోనే రెండో పెళ్లి ప్రకటన – కాబోయే భర్త ఫోటో షేర్ చేసిన జాను లిరి