Published On:

Mrunal Thakur: అక్కినేని హీరోతో మృణాల్ ఠాకూర్‌ పెళ్లి? – ఫోటో వైరల్‌

Mrunal Thakur: అక్కినేని హీరోతో మృణాల్ ఠాకూర్‌ పెళ్లి? – ఫోటో వైరల్‌

Mrunal Thakur and Sumanth Wedding Rumours: మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీతారామం, హాయ్‌ నాన్న చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి దగ్గరైంది ఈ మరాఠి భామ. మొదట హిందీ సీరియల్స్‌లో నటించిన ఈ భామ ఆ తర్వాత వెండితెర ఎంట్రీ ఇచ్చింది. హిందీ పలు చిత్రాల్లో నటించిన ఆమెకు ఆశించిన గుర్తింపు రాలేదు. అదే సమయంలో సీతారామం చిత్రంలో తెలుగులో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. ఇందులో సీత పాత్రలో తనదైన నటన ఆకట్టుకుంది ఈ భామ. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవ్వడంతో ఇక్కడ ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది. ఆ తర్వాత తెలుగులో హాయ్‌ నాన్న, ఫ్యామిలీ స్టార్‌ వంటి సినిమాలతో ఇక్కడ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.

 

ప్రస్తుతం హిందీ, తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నీ భామ.. ఓ టాలీవుడ్‌ హీరోతో ప్రేమలో మునిగితేలుతుందట. అతడు మరెవరో కాదు అక్కినేని హీరో సుమంత్‌. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి రూమర్స్‌ నెట్టింట హాట్‌ టాపిక్‌ మారాయి. ఇది తెలిసి నెటిజన్స్‌ అంతా షాక్‌ అవుతున్నారు. వీరిద్దరి రిలేషన్‌లో ఉండటమేంటి? సుమంత్‌, మృణాల్‌కి పెళ్లేంటి? అని అంతా షాక్‌ అవుతున్నారు. ఇంతకి అసలు సంగతేంటంటే.. మృణాల్, దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రలో వచ్చిన సీతారామం సినిమాలో సుమంత్‌ కూడా నటించిన నటించిన సంగతి తెలిసిందే.

 

మేజర్‌గా బ్రిగెడియర్‌ విష్ణు శర్మ పాత్రలో కనిపించాడు. కనిపించింది కొన్ని క్షణాలైన కీ రోల్‌ పోషించి మంచి గుర్తింపు పొందాడు. అయితే ఈ సినిమా టైంలోనే మృణాల్, సుమంత్‌ మధ్య పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారిందని, త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్దమవుతున్నారంటూ కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూర్తూ సుమంత్‌, మృణాల్‌లు కలిసి దిగిన ఓ ఫోటో బయటకు వచ్చింది. ఇందులో మృణాల్, సుమంత్‌పై భుజంపై వాలి సన్నిహితంగా కనిపించింది. అది చూసి వీరద్దరు ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు క్రియేట్‌ చేశారు.

 

అయితే కొంతమంది అవును అన్నట్టుగా స్పందిస్తూ మరికొందరు మాత్రం ఈ వార్తలు అసలు నిజం కావు అంటున్నారు. ఒకే సినిమాలో నటించారు.. కాబట్టి ఆ మాత్రం క్లోజ్‌ ఉంటే తప్పేంటి? అలా కాస్తా సన్నిహితంగా ఉన్నంత మాత్రాన ప్రేమలో ఉన్నట్లేనా? అంటున్నారు. ఇద్దరు నటులు మధ్య ఆ మాత్రం రాపో ఇండస్ట్రీలో కామన్‌, అని ఈ వార్తలు అన్ని పుకార్లే అని ఖండిస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ వరుస సినిమాలతో బిజీగా ఉంది, నటి ఆమె కెరీర్‌ పీక్‌లో ఉంది.. ఈ టైంలో ఆమె పెళ్లి చేసుకునే ఛాన్స్‌ లేదంటూ ఈ వార్తలను కొట్టిపారేస్తున్నారు. కాగా సుమంత గతంలో తొలిప్రేమ హీరోయిన్‌ కీర్తి రెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లయిన కొంతకాలానికే మనస్పర్థల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. భార్యభర్తలుగా విడిపోయిన.. తాము మంచి స్నేహితులుగా ఉన్నామంటూ సుమంత్‌ పులు సందర్భాల్లో చెప్పాడు.