Published On:

Nithiin Thammudu Release Date: తమ్ముడు రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన మేకర్స్‌ – ఏంటీ.. ఈ సినిమాలో లయ లేదా?

Nithiin Thammudu Release Date: తమ్ముడు రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన మేకర్స్‌ – ఏంటీ.. ఈ సినిమాలో లయ లేదా?

Nithiin Thammudu Movie Release Date Announced: వరుస ప్లాప్స్‌ వెంటాడుతున్న తరుణంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ టైటిల్‌తో తన లక్‌ను పరిక్షించుకోవాలనుకుంటున్నాడు యంగ్‌ హీరో నితిన్‌. అతడు పవన్‌ కళ్యాణ్‌ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. దీంతో ఆయన హిట్‌ మూవీ తమ్ముడు టైటిల్‌తో నితిన్‌ సినిమా రాబోతోంది. అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పటి నుంచి ఈ మూవీపై హైప్ క్రియేట్‌ అయ్యింది. ఇప్పటికే ఈచిత్రం పలుమార్లు వాయిదా పడింది. దీంతో తమ్ముడు రిలీజ్‌ కోసం నితిన్‌ ఫ్యాన్స్‌తో పాటు పవర్‌ స్టార్‌ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు మేకర్స్‌.

 

ఈ నేపథ్యంలో రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ చేస్తూ ఆసక్తికర వీడియో రిలీజ్‌ చేశారు. ‘వకీల్ సాబ్’ ఫేం వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన బర్త్‌డే సందర్భంగా మూవీ టీం రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. జులై 4న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్‌ని ఫన్నీ వీడియోతో ప్రకటించి హైప్‌ పెంచారు. ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడలు హీరోయిన్లుగా నటిస్తుండగా సీనియర్‌ నటి లయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతోనే ఆమె తెలుగలో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా షేర్‌ చేసిన ఈ వీడియోలో తన బర్త్‌డే సందర్భంగా ఆర్టిస్ట్స్‌ అంతా విష్‌ చేయడానికి వస్తారని, వాళ్లని ఆపోద్దంటూ తన అసిస్టెంట్స్‌కి చెబుతాడు.

 

ఆ తర్వాత మొదట ఓ ఆర్టిస్టు వచ్చి తమిళంలో రిలీజ్‌ డేట్‌ ఎప్పుడని అడుగుతుంది. ఆ తర్వాత హీరోయిన్‌ వర్ష బొల్లమ్మ పూల బొకె పట్టుకుని వచ్చి.. ఫ్యాన్స్‌ ఇచ్చారు ఎలా ఉందని అడుగుతూ షాకిస్తుంది. నా మిమ్స్‌ నేనే వేసుకుంటున్నా, నా ఫోటోలకు నేనే క్యాప్షన్‌ ఇచ్చుకుంటున్నా. నా ట్రోల్స్‌ నేనే చేసుకుంటున్నా. ఇంతకి రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు, ప్రమోషన్స్‌ ఎప్పుడు సర్‌ అంటూ అసహనం చూపిస్తుంది. ఆ తర్వాత సప్తమి గౌడ వచ్చి కన్నడలో మాట్లాడుతుంది. ఇది నా ఫస్ట్‌ తెలుగు డెబ్యూ మూవీ. సినిమా అనౌన్స్‌ చేసి రెండేళ్లు అవుతుంది. నేను సెట్‌లో అడుగుపెట్టి ఏడాది అవుతుంది. షూటింగ్‌ ఆరేళ్లు. అందరు నీ తెలుగు సినిమా రిలీజ్‌ ఎప్పుడు, ప్రమోషన్స్‌ ఎక్కడ అని అడిగి చంపేస్తున్నారు. ఇంతకి సినిమా రిలీజ్‌ ఎప్పుడు సార్‌ అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంది.

 

ఆ తర్వాత లయ వచ్చి.. ఎన్నో ఏళ్ల తర్వాత నేను రీఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. ఒక్క పోస్టర్‌ లేదు, అనౌన్స్‌మెంట్‌ లేదు. అసలు నేను ఈ సినిమాలో ఉన్నానా? డైరెక్టర్‌ గారూ. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో చెప్పండి.. కనీసం థియేటర్‌కి అయిన వెళ్లి చూసుకుంటాను అని అనడంతో.. డైరెక్టర్‌ డిసప్పాయింట్‌ అవుతారు. ఇక చివరిలో దిల్‌ రాజు కేక్‌తో వచ్చి.. రావయ్యా.. రా ముందు కేక్‌ కట్‌ చేయ్‌.. రిలీజ్‌ డేట్‌ది ఏముంద తర్వాత చూసకోవచ్చు అని అంటాడు. ఇక డైరెక్టర్‌ దగ్గరికి రాగానే కేక్‌ చూడు.. జూలై 4న తమ్ముడు రిలీజ్‌ అని అనౌన్స్‌మెంట్‌ ఇచ్చేసారు. ప్రస్తుతం ఈ వీడియో అందరిని బాగా ఆకట్టుకుంటుంది. అక్కడ సెంటిమెంట్‌తో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.