Odela 2 OTT Release: నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తోన్న తమన్నా ‘ఓదెల 2’ – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!

Tamannaah Odela 2 OTT Release: లాంగ్ గ్యాప్ తర్వాత తమన్నా తెలుగులో నటించిన మూవీ ‘ఓదెల 2’. తమన్నా శిశశక్తిగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వలేదనిపించింది. డైరెక్టర్ సంపత్ నంది స్క్రిన్ ప్లే అందించిన ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించారు. విడుదలకు ముందు మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్నా నాగసాధువుగా కనిపిస్తుండటంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
అయితే విడుదల తర్వాత ఆ రేంజ్‌లో రెస్పాన్స్ అందుకోలేకపోయింది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఓదెల 2 ఓటీటీ రిలీజ్‌కి సంబంధించిన సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కాగా తమన్నా ప్రధాన పాత్రలో హెబ్బా పటెల్, వశిష్ట సింహా కీలక పాత్రలో నటించారు. సంపత్ నంది స్క్రిన్‌ప్లేలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అనే అంచనాలు నెలకొన్నాయి. గతంలో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయని ఓదెల రైల్వే స్టేషన్‌కి ఇది సీక్వెల్ కావడంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో మూవీ రిలీజైంది.
కానీ ఆడియర్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ నిరాశ పరిచాయి. మూడు రోజుల్లో కేవలం రూ. 6.25 కోట్లు మాత్రమే రాబట్టింది. బిగ్‌స్క్రీన్‌పై పర్వాలేదనిపించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓదెల 2 మే 17నుంచి డిజిటల్ ప్రీమియర్‌కు రానుందని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని తీసుకుంది. మూవీ విడుదలైన నెల రోజులు కావస్తుండటంతో మే 17న ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.