Allu Arjun: మా మామయ్య చిరంజీవి ఫ్యాన్స్ వలనే ఈ స్థాయిలో ఉన్నా: అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

Allu Arjun Comments At WAVES Summit 2025: అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైనర్ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్యర్యంలో కేంద్రప్రభుత్వం వేవ్స్ పేరుతో సమ్మిట్‌ని నిర్వహించింది. మే1 నుంచి మే 4 వరకు ఈ సదస్సు కొనసాగనుంది. వరల్డ్ ఆడియో విజువల్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WAVES Summit 2029) పేరుతో జరిగిన ఈ కార్యక్రమాన్ని ముబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన ఎంతో నటీనటులతో పాటు దక్షిణాది నుంచి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, మోహన్‌లాల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
అమితాతాబ్ బచ్చన్, జయమాలిని, మిథున్ చక్రవర్తి, అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, దీపికా పదుకొనె, రజనీకాంత్, మోహన్‌లాల్‌తో పాటు పలువురు ఈ సమ్మిట్ ఆడ్వైజరీ సభ్యులుగా ఉన్నారు. పలువురు స్టార్స్ ఈ సమ్మిట్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. దక్షిణాది నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సమ్మిట్ పాల్గొన్ని తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇక మెగాస్టారం చిరంజీవి అడ్వైజరీ సభ్యులుగా ఉన్న ఈ సమ్మిట్‌లో బన్నీ పాల్గొనడం ఆసక్తిని సంతరించుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సమ్మిట్ మాట్లాడిన మాటలు హాట్‌టాపిక్‌గా నిలిచాయి.
ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. తన తాతయ్య అల్లు రామలింగయ్య వెయ్యికి పైగా సినిమాల్లో నటించారని, తన తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా 70పైగా చిత్రాలు నిర్మించారని చెప్పాడు. తాను ఈ స్థాయికి వచ్చానంటే తన మామ చిరంజీవి ఫ్యాన్స్ సపోర్టుతోనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమాతో తాను జాతీయ స్థాయి గుర్తింపు పొందానని, ఈ సినిమాకు గానూ నేషనల్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. నటుడిగా తనకు సినిమా తప్పా మరే ఆలోచన ఉండని, షూటింగ్ లేకపోతే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. ఇక బాలీవుడ్ సిక్స్ ప్యాక్‌ల ట్రెండ్ నడుస్తోంది..
దక్షిణాది ఆ సిక్స్ ప్యాక్ ట్రై చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు అల్లు అర్జున్. దక్షిణాది సిక్స్ ప్యాక్ ట్రై చేసిన తొలి నటుడు కూడా బన్నినే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ దానిపై స్పందించాడు. ఒకప్పుడు సిక్స్ ప్యాక్ అంటే అది సవాలుతో కూడుకున్న విషయం.. దానిని సౌత్‌లో పెద్దగా ఫాలో అయ్యేవారు కాదు. బాలీవుడ్‌లో అది ట్రెండ్ అవుతుంటే.. దక్షిణాది మాత్రం అది ట్రై చేయాలనే ఆలోచన కూడా ఎవరికి ఉండేది కాదు. ఓ నటుడు నాతో ఇలా ఛాలెంజ్ చేశాడు. మన దక్షిణాది హీరోలు సిక్స్ ప్యాక్ చేయలేరని, ఈ ఆహరపు అలవాట్ల వల్ల వారికి అది అసాధ్యమని అన్నాడు. అది పొగొట్టాలంటే నువ్వు ట్రై చద్దామని నన్ను సవాలు చేశాడు. దానికి ఛాలెంజింగ్‌గా తీసుకుని సిక్స్ ప్యాక్ ట్రై చేశాను అన్నాడు.