Anchor Rashmi: వీల్ చైర్‌పై యాంకర్ రష్మీ – వీడియో వైరల్, అసలేమైందంటే..

Anchor Rashmi Shared Video After Return From Bali Trip: యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. భుజం నొప్పి, తీవ్ర రక్త స్రావం సమస్యలతో బాధపుడుతున్న ఆమె ఇటీవలె ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని రష్మీనే స్వయంగా చెప్పింది. ఏప్రిల్ 18న ఆమెకు ఆపరేషన్ జరిగిందని వెల్లడించింది. అయితే సర్జరీ జరిగి వారం తిరక్కుండానే ఆమె బాలి వెకేషన్‌కి వెళ్లింది. ఇవి నెటిజన్స్ రకరకాలు కామెంట్స్ చేశారు.
అయితే వాటికి స్పందిస్తూ ఈ ట్రిప్ రెండు నెలల ముందే ప్లాన్ చేశామని తెలిపింది. వెకేషన్‌లో ఫోటోలు షేర్ అసలు విషయం చెప్పుకొచ్చింది. తన ప్రతి బర్త్‌డేకి వెకేషన్ వెళ్లడం అలవాటు, అలాగే ఈసారి కూడా రెండు నెలల ముందే ట్రిప్ ప్లాన్ చేశానని చెప్పింది. ట్రిప్ క్యాన్సిల్ చేసుకుందామనుకుంటే అది కుదరలేదని, తప్పక వెకేషన్‌కి వెళ్లాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఇక బాలి పర్యటన నుంచి తిరిగి ఇండియాకు వస్తున్న వీడియోను తాజాగా షేర్ చేసింది. ఏప్పుడో ఏప్రిల్ 24 ట్రిప్ ముగించుకుని ఇండియాకు వచ్చింది.
తాజాగా ఈ వీడియోను షేర్ చేసింది. అయితే ఇందులో రష్మీ వీలు చైర్‌పై కూర్చుని కనిపించింది. చైర్ నడవలేని స్థితి ఉన్న ఆమెకు వీలు చైర్‌లోనే బోర్డింగ్‌కి వరకు తీసుకువెళ్లారు. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ.. ‘బాలి ట్రిప్ కూడా ఇలాగే జరిగిందని చెప్పింది. “ఈ ట్రిప్‌ని మా అమ్మ తన జీవితకాలం వరకు మర్చిపోదు. ఇక నన్ను జీవితాంతం దెప్పిపొడుస్తూనే ఉంటుంది. వెకేషన్‌కి వెళ్లాననే మాటే గాని.. ఎన్నో షరతులు, నిమయాలతో బాలి ట్రిప్ గడిచింది.
డైవింగ్ చేయకూడదు. ఇసుక ఆడకూడదు, ఏటీవీ రైడ్స్, స్విమ్మింగ్, డ్యాన్స్, జంపింగ్ చేయకూడదు. ఆఖరికి బీచ్‌లో కూడా స్నానం చేయలేకపోయాను. చెప్పడం మర్చిపోయా.. స్నానం కూడా చేయకూడదు’ అంటూ తన ట్రిప్ విశేషాలను పంచుకుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీల్ చైర్‌లో రష్మిని చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆమె ఇంకా కోలుకోలేదా? ఆమె హెల్త్ ఎలా ఉందని కంగారు పడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- HIT 3 Box Office Collection: సెంచరీ కొట్టేసిన అర్జున్ సర్కార్ – నాలుగు రోజుల్లోనే హిట్ 3 రికార్డు కలెక్షన్స్