Prabhas Marriage Rumours: బడా వ్యాపారవేత్త కూతురితో ప్రభాస్ పెళ్లి! – సీక్రెట్‌గా ఏర్పాట్లు చేస్తున్న శ్యామలా దేవి?

Prabhas Marriage With Business Man Daughter?: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే వెంటనే గుర్తోచ్చే పేరు ప్రభాస్‌దే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే డార్లింగ్ ఎప్పుడెప్పుడు ఓ ఇంటివాడు అవుతాడా? అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు ప్రభాస్ పెళ్లంటూ వార్తలు వినిపించాయి. అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ఎప్పటికప్పుడు వాటిపై క్లారిటీ ఇస్తూ రూమర్లకు చెక్ పెడుతు వస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ పెళ్లంటూ మరోసారి వార్తలు తెరపైకి వచ్చాయి.
గతంలోనూ పెళ్లి వార్తలు
ఈసారి బడా వ్యాపారవేత్త కుమార్తెతో పెళ్లి ఫిక్స్ అయ్యిందని, ప్రస్తుతం ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి రహస్యాంగా పెళ్లి ఏర్పాట్ల చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈసారి పెళ్లి కూతురు కూడా ఎవరనేది కూడా చెప్పేస్తూ ప్రచారం మొదలుపెట్టడంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇంతకి ఈ వార్తలు నిజమా? అబద్దమా? అనే డైలామాలో ఉన్నారు. రీసెంట్‌గా అన్‌స్టాపబుల్ ఆక్‌లో షోలో హోస్ట్ బాలకృష్ణ ప్రభాస్ పెళ్ల ఎప్పుడు అనే ప్రశ్న లేవదిశారు. ఇదే ప్రశ్నను ప్రభాస్‌ని అడగ్గా.. అవుతుంది సార్ అన్నాడు. అలాగే గోపిచంద్‌ని అడిగిన ఈ ఏడాది అవ్వోచ్చు అంటూ హింట్ ఇచ్చారు.
రామ్ చరణ్ హింట్
సెలబ్రిటీ కాల్‌లో హీరో రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అడగ్గా.. ఈ ఏడాది ఉంటుందని, అమ్మాయి ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని గణపవరం అంటూ హింట్ ఇచ్చేసాడు. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఎవరా లక్కీ గర్ల్ అని అంతా ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి అంటే ఖచ్చితంగా ఓ బడా వ్యాపారవేత్త కూతురు అయ్యింటుందని ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి తోడు ఇటీవల శ్యామలా దేవి, ఆమె ముగ్గురు కూతుళ్లు కలిసి ఓ పెళ్లికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను వారి పెద్ద కూతురు ప్రసీద తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.
బంధువుల పెళ్లిలో పెద్దమ్మ, చెల్లెల్లు
ఈ పెళ్లిలోనే శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి బంధువులతో చర్చించారట. దీంతో ప్రభాస్ పెళ్లి వార్తలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే శ్యామలా దేవి స్పందించేవరకు వేచి చూడాల్సిందే. అయితే ఈ వార్తలు నిజమయ్యే అవకాశం లేదని కొందరి నుంచి అభిప్రాయాలు వస్తున్నాయంటే. ఎందుకంటే ప్రస్తుతం డార్లింగ్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్సతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు. తీరిక లేకుండ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అవన్ని కంప్లీట్ అవ్వడానికి మూడు నుంచి నాలుగేళ్లయిన పడుతుంది. కాబట్టి ఇప్పట్లలో డార్లింగ్ నుంచి పెళ్లి కబురు వచ్చే ఛాన్స్ లేదంటున్నాయి సన్నిహితవర్గాలు.