Samantha: అప్పుడే ఏ బంధమైన కొనసాగుతుంది – పార్ట్‌నర్‌పై సమంత పోస్ట్ వైరల్
![Samantha: అప్పుడే ఏ బంధమైన కొనసాగుతుంది – పార్ట్‌నర్‌పై సమంత పోస్ట్ వైరల్](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/samantha-1.jpg)
Samantha Shared Relationship Post: సమంత ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతుంది. ఇటీవల ఆమె సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కొద్ది రోజులు సమంత సోషల్ మీడియాలో సందేశాత్మకమైన పోస్ట్స్ షేర్ చేస్తోంది. తాజాగా పార్ట్‌నర్స్ ఎలా ఉండాలో చెబుతూ జేశెట్టి అనే రచయిత మాట్లాడిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేసింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏ బంధమైన ముగిపోతుందని ఆయన అందులో పేర్కొన్నారు.
“అన్ని విధాలుగా నిజమైన ప్రేమను ఇవ్వగలిగిన అద్భుమైన పార్ట్‌నర్, బంధాన్ని మీకు ఉండోచ్చు. కానీ మీరు మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసకోకపోతే మీరు కోరుకున్న విధంగా మీ భాగస్వామికి మీరు కనిపించలేరు. అప్పుడు ఆ బంధం కొనసాగలేదు. ఎలా అంటే ఎదుటి వ్యక్తిలో మనం ఇష్టపడేవి చాలా ఉంటాయి. కానీ మన మనసు, శరీరం ఎలా ఉందనేది మాత్రం గుర్తించలేకపోతే.. ఎదుటివ్యక్తి వారు కోరుకునే విధంగా మనం ఉండోకపోవచ్చు. అలాంటి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఎప్పుడైతే మన శరీరం, మానసిక స్థితిని గుర్తించుకుని పార్ట్‌నర్‌తో నచ్చినట్టుగా ఉన్నప్పుడు ఆ బంధం కొనసాగుతుంది” అనే ఆయన వ్యాఖ్యలు ఉద్దేశం.
ప్రస్తుతం ఈ పోస్ట్ హాట్‌టాపిక్‌గా మారింది. కాగా ఇటీవల నాగ చైతన్య ఓ షోలో తన మొదటి పెళ్లి, విడాకులపై మాట్లాడిన అనంతరం సమంత చేస్తున్న పోస్ట్స్ ఆసక్తిని సంతరించకుంటున్నాయి. నిన్న సద్గురు కోట్‌ని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఒక మనిషిగా ఈ ప్రపంచంలో మీరు శాశ్వతం కాదు. ఇది ఎప్పటికప్పుడు మారుతూ నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇక్కడ ఏది స్తిరంగా ఉండదు. ఈ ప్రపంచంలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండోచ్చు” అని కోటేషన్ షేర్ చేసింది. ఇది నాగ చైతన్యను ఉద్దేశించి చేసి ఉంటుందని అంతా అభిప్రాయపడ్డారు.