Published On:

Pakistan: భారత్ పైకి 130 అణ్వాయుధాలు! ఎక్కడ దాచామో ఎవరికీ తెలియదు!

Pakistan: భారత్ పైకి 130 అణ్వాయుధాలు! ఎక్కడ దాచామో ఎవరికీ తెలియదు!

Pakistan: భారత్ పై ప్రయోగించేందుకు 130 అణ్వాయుధాలు రెడీగా ఉన్నాయని అన్నారు పాకిస్థాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి. ఘోరీ, షాహీన్, ఘజ్నవి క్షిపణులు కూడా ఉన్నాయన్నారు. పాక్ ఆయుధాలన్నీ భారత్ కోసమే తయారుచేశామన్నారు. సింధూ జలాలను భారత్ ఆపేస్తే  దాడులకు దిగుతామన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దమన్నారు.   అణ్వాయుదాలు దేశంలో చాలాచోట్ల రహస్యంగా ఉన్నాయని, అవిఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదన్నారు. అణ్వాయుధాలను ప్రదర్శనకు కాదన్నారు.

 

 

పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాకిస్థాన్ పై దౌత్యసంబంధాలను కఠినతరం చేసింది భారత్. ఇందులో భాగంగానే సింధూ జలాలను నిలిపివేసింది. పాకిస్థాన్ జాతీయులకు అన్ని రకాల వీసాలను నిలిపివేసింది. భారత్ లో ఉన్నవారిని తిరిగి వెళ్లడానికి డెడ్ లైన్ విధించింది.

 

పాక్ మంత్రులు అసహనం వ్యక్తం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాము పాక్ గగనతలాన్ని మూసివేయడంతో భారత్ విమానయానంలో గందరగోళం ఏర్పడిందని అన్నారు. మరో 10రోజులు ఇలాగే కొనసాగితే భారత విమానయాన సంస్థలు దివాలా తీస్తాయన్నారు. వీరి వ్యాఖ్యలు హాస్యాస్పదమంటున్నారు విశ్లేషకులు. భారత్ కావాలనే పాకిస్ధాన్ పై నిందమోపుతుందని ఆరోపించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని నిలిపివేయడంతో పాకిస్థాన్ ఇప్పటికే పతనానికి సిద్ధమైందని అన్నారు.

 

 

టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చింది నిజమే
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ మీడియాకు  ఇంటర్వూ ఇచ్చారు. గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చి శిక్షణ ఇచ్చినట్లు ఒప్పుకున్నారు.  “అమెరికా, బ్రిటన్ దేశాలకోసం ఇటువంటి పనులను చేస్తున్నాం. ఇందుకు పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా యుద్ధంలో చేరకపోతే పాకిస్థాన్ అభివృద్ది చెందేది. 9/11 ఉగ్రదాడి తర్వాత మాపై నిందలు ఎక్కువయ్యాయి. లష్కరే అనేది పాతపేరు అది ఇప్పుడు ఉనికిలో లేదు. పహల్గాం దాడిని తాము ఖండిస్తున్నాం” అని అన్నారు.