Published On:

Hit-3 Movie Team: తిరుమల శ్రీవారిని జంటగా దర్శించుకున్న న్యాచురల్ స్టార్ హీరో నాని, హీరోయిన్ శ్రీనిధి

Hit-3 Movie Team: తిరుమల శ్రీవారిని జంటగా దర్శించుకున్న న్యాచురల్ స్టార్ హీరో నాని, హీరోయిన్ శ్రీనిధి

Hero Nani and Heroine Srinidhi Shetty  in Tirumala: టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టిలు జంటగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు రంగనాయకుల మండపంలో వేద పండితులు నాని, శ్రీనిధిలను ఆశీర్వదించారు. అనంతరం పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

 

కాగా, హీరో నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’. ఈ సినిమా మే 1వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా మంచి హిట్ సాధించాలని హీరోహీరోయిన్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే వీరిద్దరూ కాలినడకన తిరుమల మెట్లు ఎక్కారు. ఎవరికి కనిపించకుండా ఉండేందుకు మాస్క్‌, కర్చీప్‌లతో ముఖానికి కట్టుకొని వచ్చారు. అయితే వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

హిట్- 3 సినిమా విషయానికొస్తే.. శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అర్జున్ సర్కార్ పాత్రలో నాని నటిస్తుండగా.. రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్, అదిల్ పాలా, సూర్య శ్రీనివాస్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించగా.. ఇప్పటికే ఈ సినిమా టీజర్స్, ట్రైలర్ విడుదలయ్యాయి.