India-Pakistan: సరిహద్దుల్లో హైటెన్షన్.. నియంత్రణ రేఖ వెంట పాక్ మరోసారి కాల్పులు!

Pakistan Army Fires Again Along LOC: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత రెండు రోజులుగా నియంత్రణ రేఖ వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి కవ్వింపు చర్యలకు పాల్పడింది. గత అర్ధరాత్రి టుట్మారి గలి, రాంపూర్ సెక్టార్లకు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ దళాలు కాల్పులు జరిపినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే కాల్పులు చేసిన పాక్ సైన్యంను భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తప్పికొట్టినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం కలగలేదని, ఎవరికీ గాయాలు సైతం కాలేదని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్ సైన్యం కాల్పులకు భారత్ దీటుగా సమాధానం ఇస్తుందని తెలిపారు. గత మూడు రోజుల నుంచి భారత్ ఆర్మీ సైతం అప్రమత్తంగా ఉందని వివరించారు. ఇప్పటికే జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో భారత సైన్యం పెద్ద సంఖ్యల్లో మోహరించింది. అలాగే, పారా మిలిటరీ సైన్యానికి ఇచ్చిన సెలవులను రద్దు చేసిన సంగతి తెలిసిందే.