Kubera First Single Out: ‘కుబేర’ ఫస్ట్ సింగిల్.. ధనుష్ పాడిన ‘పోయి రా మామా’ తెలుగు పాట ప్రోమో చూశారా..?

Kubera Poyira Mama Firts Song Promo Out: ఎట్టకేలకు కుబేర నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కి మేకర్స్ ముహుర్తం ఫిక్స్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. ఎప్పుడో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా స్లో స్లోగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటి వరకు ఈ మూవీ ఫ్యాన్స్‌ని అట్రాక్ట్ చేసే అప్‌డేట్ ఏం రాలేదు. కేవలం నటీనటులు లుక్స్, వారికి సంబంధించిన గ్లింప్ప్ మాత్రమే రిలీజ్ చేశారు.
అలాగే ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కుబేరలో పాత్రలను రివీల్ చేయకుండ జస్ట్ మూవీ థీమ్ మాత్రమే తెలిజేస్తూ ఈ వీడియో సాగింది. ఇందులోని విజువల్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ షూరు చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ని రెడీ చేశారు. ధనుష్ పాడిన ఈ పాట ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘పోయి రా మామా’ అంటూ ఈ పాట సాగనుంది. ఇందుకు సంబంధించిన ప్రొమోను తాజాగా విడుదల చేసి బజ్ పెంచారు మేకర్స్. ఇందులో ధనుష్ వీధుల్లో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పాట మాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. కాగా కుబేరలోని ధనుష్ లుక్ అందరిలో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో ధనుష్ బిచ్చగాడి పాత్రలో, నాగార్జున కుబేరుడైన వ్యాపారవేత్త పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 20న కుబేర మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి:
- Actress Abhinaya Marriage: నటి అభినయ పెళ్లి వేడుకలు – కాబోయే భర్తతో ఆమె అల్లరి చూశారా..? ఫోటోలు వైరల్