Published On:

Kalanki Bhairava First Look: రాజశేఖర్ జీవిత చేతుల మీదుగా ‘కాళాంకి భైరవుడు’ ఫస్ట్‌లుక్‌!

Kalanki Bhairava First Look: రాజశేఖర్ జీవిత చేతుల మీదుగా ‘కాళాంకి భైరవుడు’ ఫస్ట్‌లుక్‌!

Kalanki Bhairava Movie First Look Out: ఈ మధ్య హారర్‌ జానర్స్‌ చిత్రాలు మంచి ఆదరణ పొందుతున్నాయి. హారర్‌ ఎలిమెంట్స్‌ వస్తున్న సినిమాలన్ని కూడా మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో చిన్న దర్శకుల నుంచి బడా డైరెక్టర్స్‌ వరకు చాల మంది ఈ జానర్‌పైనే ఫోకస్‌ పెడుతున్నారు. ఇప్పుడు అలాంటి జానర్‌ నుంచి మరో సినిమా వస్తుంది. అదే ‘కాళాంకి భైరవుడు’. శ్రీరాముడింట శ్రీక్రిష్ణుడంట, నివాసి చిత్రాల తర్వాత గాయత్రీ ప్రోడక్షన్స్‌ నుంచి వస్తున్న చిత్రమిది.

 

హారర్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రాజశేఖర్‌ వర్మ, పూజ కీరణ్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని జరుపుకుంటుంది. ఇక త్వరలోనే మూవీ రిలీజ్‌ నేపథ్యంలో ప్రమోషన్స్‌ షురు చేసింది మూవీ టీం. ఈ ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఒకప్పటి స్టార్‌ హీరో, యాగ్రీ మ్యాన్‌ రాజశేఖర్‌, ఆయన భార్య జీవితలు కలిసి ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని లాంచ్‌ చేశారు. ఇందులో హీరో రాజశేఖర్‌ వర్మ ఇంటెన్స్‌ లుక్‌లో కనిపించాడు.

 

ఇంటెన్సీవ్ గా ఫస్ట్ లుక్

డార్క్‌ థీమ్‌లో ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌లో చూట్టు కపాలాలు, తంత్ర ముగ్గు, బ్యాగ్రౌండ్‌లో మేకతో ముసుగులో ఉన్న చేతిలో దీపం పట్టుకుని కనిపించారు. ఈ ఫస్ట్‌లుక్‌తోనే మూవీలో హారర్‌ ఎలిమెంట్స్‌ ఏ రేంజ్‌లో ఉండనున్నాయో పరిచయం చేసే ప్రయత్నం చేసింది టీం. కాగా హరి హరన్‌. వి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గాయత్రీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కేఎన్‌ రావు, ఆర్‌. శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆమని, రితిక చక్రవర్తి. నాగ మహేష్‌, బలగం జయరాం, భవ్య , మహమద్‌ బాషా, బాల్లి మొరళి నటిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: