Andhra Pradesh : ఏపీ మద్యం కుంభకోణం కేసులో బిగ్ ట్విస్ట్.. సజ్జల శ్రీధర్‌రెడ్డి విజయవాడకు తరలింపు

Sajjala Sridhar Reddy arrested : ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు సజ్జల శ్రీధర్‌రెడ్డిని హైదరాబాద్ నుంచి సిట్ అధికారులు విజయవాడకు తీసుకువచ్చారు. శనివారం అతడిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు. ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల లిక్కర్ స్కామ్ ప్రధాన కుట్రదారుల్లో కీలక నిందితుడిగా ఉన్నారు. కేసులో ఏ-6గా ఉన్న అతడిని సిట్ అధికారులు శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అరెస్టు చేశారు. శనివారం ఉదయం విజయవాడకు తీసుకొచ్చారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని అడ్డుపెట్టుకుని నెలనెల ర.60కోట్ల మేర ముడుపులు సేకరించాలనే విషయంలో ఎంపీ మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, నాటి ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ ప్రత్యేక ఆఫీసర్ సత్యప్రసాద్‌తో కలిసి శ్రీధర్‌రెడ్డి కుట్రలు చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే కేసులో శ్రీధర్‌రెడ్డిని అరెస్టు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.