Actress Abhinaya Marriage: నటి అభినయ పెళ్లి వేడుకలు – కాబోయే భర్తతో ఆమె అల్లరి చూశారా..? ఫోటోలు వైరల్

Abhinaya Wedding Celebrations Photos: నటి అభినయ గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘డమరుకం’, రాజుగారి గది 2 వంటి చిత్రాలతో తెలుగు మంచి గుర్తింపు పొందింది. వెండితెరపై అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజానికి అభినయ మాట్లాడేదనే విషయం తెలిసిందే. ఆమెకు వినిపించదు కూడా. ఇది తెలిసి ఆడియన్స్ అంతా షాక్ అయ్యారు. తెరపై పాత్రకు, డైలాగ్ తగ్గ హావభవాలు పలికించి అందరిని సర్‌ప్రైజ్ చేసింది.
చెవుడు, మూగ అయినప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది. అయితే త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతోన్న సంగతి తెలిసిందే. తన చిరకాల మిత్రుడు, ప్రియుడు సన్నీ వర్మ (వేగేశ్ కార్తీక్)తో పెళ్లాడబోతోంది. మార్చి 9న వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే తాజాగా వీరిద్దరు పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. రేపు బుధవారం (ఏప్రిల్ 16) అభినయ, సన్నీవర్మంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో పెళ్లి వేడుకలో భాగంగా మహెందీ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను తాజాగా అభినయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ప్రియుడితో కలిసి సంగీత్, మహెందీ కార్యక్రమంలో ఆనందంగా పాల్గొంది. కాబోయే భర్తతో కలిసి చిందులేసింది. ఇందులో అభినయ ఎంతో ఆనందంగా అల్లరి చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఆమె పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా మాస్ మహారాజా రవితేజ నేనింతే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె కింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. శంభో శివ శంభో వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. ఇటీవల పని అనే మలయాళ చిత్రంలో నటించిన తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- Kalyan Ram on Jr NTR New Look: ఎన్టీఆర్కు ఏమైంది..? ఎందుకు అలా సన్నబడ్డారు: తారక్ ఆరోగ్యంపై కళ్యాణ్ రామ్ క్లారిటీ!