Actress Pavithra Lakshmi: నటిపై అలాంటి పుకార్లు.. ప్లీజ్ నా జీవితంతో ఆడుకోకండి: హీరోయిన్ రిక్వెస్ట్!

Pavithra Lakshmi Respond on Plastic Surgery Rumour: స్టార్ హీరోయిన్ సమంత పోలికలతో ఇండస్ట్రీలో పలువురు నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో పవిత్ర లక్ష్మి ఒకరు. తమిళమ్మాయైన ఆమె కాదల్ కణ్మని అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. అయితే కొద్ది రోజులుగా ఈమె లుక్‌పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ కోలీవుడ్ మీడియాల్లో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తనపై వస్తున్న వార్తలు, కామెంట్స్‌పై పవిత్ర లక్ష్మి అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది.
కొన్ని రోజులుగా నా గురించి ఏవేవో తప్పుడు వార్తలను సృష్టించి వాటిని ప్రచారం చేస్తున్నారు. నా లుక్స్, నా బరువు గురించి మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొన్ని అయితే చెప్పలేని విధంగా ఉన్నాయి. వీటన్నింటికి నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. వీటికి సంబంధించి స్టోరీలు షేర్ చేశాను. అయినా కూడా నాపై ఈ అసత్య ప్రచారం మాత్రం ఆగడం లేదు. అందుకు మరోసారి మీ అందరికి క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా.. గత కొన్ని రోజులుగా నేను తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా. దానికోసం చికిత్స కూడా తీసుకుంటున్నాను.
ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నాను. దయచేసి మీ వినోదం కోసం నా భవిష్యత్తుతో ఆడుకోకండి. నాకంటూ జీవితం ఉంది. ఇండస్ట్రీలో నాకంటూ ఒక గుర్తింపు ఉంది. ప్లీజ్ దానికి చెడగొట్టే ప్రయత్నం చేయకండి. నా విన్నపం ఒకటే ప్లీజ్ ప్లీజ్.. ఇలాంటివి పునరావృతం కానివ్వకండి. మీ నుంచి కాస్తా ప్రేమ, మరింత గౌరవం మాత్రమే కోరుకుంటున్నా. మీరు ఎప్పుడు నాపై ప్రేమాభిమానాలే చూపించేవారు. దాన్ని అలాగే కొనసాగించండి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను” అంటూ ఆమె రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
కాగా పవిత్ర లక్ష్మి కోలీవుడ్ పలు చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. 2015లో ఓ కాదల్ కణ్మని సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించి ఈ సినిమాలో ఆమె అతడి సహా ఉద్యోగి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత కూకు విత్ కోమలి అనే కుకింగ్ షోలో పాల్గొన్ని లైమ్‌లైట్లోకి వచ్చింది. కాస్తా సమంత పోలికలు కనిపించడం ఆమె ఇండస్ట్రీలో నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. ఒకే ఏడాదిలోనే నాయి శేఖర్, ఉల్లాసం, అదృశ్యం వంటి చిత్రాల్లో నటించింది.
View this post on Instagram