Fauji Actress Imanvi Clarifications: ‘నాది పాకిస్తాన్ కాదు, నాలోనూ భారతీయ మూలాలు’ – ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ హీరోయిన్!

Fauji Actress Imanvi Clarifies About Her Identity over Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రభాస్ ఫౌజీ హీరోయిన్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పాకిస్తానీకి చెందిన యువతి అని, తనని ఫౌజీ చిత్రం తొలగించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్స్ వచ్చాయి. ఇమాన్వీ తండ్రి గతంలో పాకిస్తాన్ మిలటరీలో పని చేశాడని, వీళ్లది పాకిస్తాన్ కరాచీ అని నిన్నటి నుంచి మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. దీంతో అంతా ఇదే నిజమని నమ్ముతూ ఇమాన్విపై వ్యతిరేకత చూపిస్తున్నారు.
తీవ్రంగా ఖండిస్తున్నా..
ఈ నేపథ్యంలో తనపై వస్తున్న నెగిటివిటీపై తాజాగా ఇమాన్వీ స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ సుధీర్ఘ పోస్ట్ షేర్ చేస్తూ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. “పహల్గామ్‌లో జరిగిన విషాద ఘటన పట్ల హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నా. ఈ ఉగ్రదాడిలో ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది తమ ప్రియమైన వారిని కోల్పోయి తీవ్ర దు:ఖంగంలో ఉన్నారు. వారందరిని తలుచుకుంటుంటే నా హృదయం బరువెక్కిపోతుంది. ఈ హింసాత్మక ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్న. ఈ క్రూరమైన చర్యను పాకిస్తానీలపై తిరిగి కొట్టేందుకు మనందరం ఏకమై రోజు త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నా.
నాది పాకిస్తాన్ కాదు..
అయితే ఈ ఘటన తర్వాత నా గుర్తింపు, నా తల్లిదండ్రుల గుర్తింపుపై సోషల్ మీడియా, మీడియా, ఆన్‌లైన్‌లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. గతంలోని కానీ, ప్రస్తుతంలో కానీ నా కుటుంబంలోని ఏ ఒక్కరికి కూడా పాకిస్తాన్ ఆర్మీతో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ద్వేషాన్ని రగిలించడమే కోసమే ఇలాంటి అబద్దపు ప్రచారాన్ని పుట్టిస్తున్నారు. అయితే ఇక్కడ నన్ను బాధించే విషయం ఏంటంటే. ఇందులో నిజనిజాలు తెలుసుకోకుండానే మీడియా, సోషల్ మీడియా కూడా ఈ తప్పుడు వార్తలను మరింత వ్యాప్తి చేయడం నన్ను తీవ్రంగా బాధించింది.
నాలోనూ భారతీయ మూలలు..
నేను భారతీయ మూలలు ఉన్న అమెరికా అమ్మాయిని. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, గుజరాతి మాట్లాడగలను. నా తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే అమెరికాకు వలస వెళ్లారు. ఆ తర్వాత అక్కడి సిటిజన్ షిప్ తీసుకుని అమెరికా పౌరులుగా మారారు. నేను లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియాలో జన్మించాను. అమెరికాలో నా యూనివర్సిటీ విద్య పూర్తి చేసిన తర్వాత నటిగా, కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్సర్‌గా కళారంగంలో వృత్తిని కొనసాగించాను. అనంతరం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పని చేసే అవకాశాలను అందుకోవడం గర్వంగా భావిస్తున్నా. సినిమా నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింంది. నా రక్తంలోనూ భారతదేశంపై ప్రేమ, భక్తి నా రక్తంలోనూ ప్రవహిస్తోంది. భారతీయమూలలు ఉన్న ఇండియన్‌గా పుట్టడం గర్వంగా భావిస్తున్నా” అంటూ ఇమాన్వి తన పోస్టులో రాసుకొచ్చింది.
View this post on Instagram