Last Updated:

Cruise Missile: క్రూయిజ్ మిస్సైల్ తో డొనాల్డ్ ట్రంప్ ను చంపితీరుతాం : ఇరాన్

ఇరాన్ కొత్త తరహా క్రూయిజ్ మిస్పైల్ ను అభివృద్ది చేసింది. 1650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఈ క్రూజ్ క్షిపిణి ఛేదించగలదు. ఈ విషయాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ వెల్లడించారు.

Cruise Missile: క్రూయిజ్ మిస్సైల్ తో డొనాల్డ్ ట్రంప్ ను చంపితీరుతాం : ఇరాన్

Cruise Missile: ఇరాన్ కొత్త తరహా క్రూయిజ్ మిస్పైల్ ను అభివృద్ది చేసింది. 1650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఈ క్రూజ్ క్షిపిణి ఛేదించగలదు. ఈ విషయాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ వెల్లడించారు.

తమ టాప్ కమాండర్ ను చంపినందుకు అగ్రరాజ్యం అమెరికా పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ఈ క్రూయిజ్ మిస్పైల్ తో అంతమొందిస్తామంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అమెరికా పై ఘాటు వ్యాఖ్యలు(Cruise Missile)

ఈ క్రూయిజ్ క్షిపిణిని ఇస్తామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అమ్ముల పొదిలో చేర్చినట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2020 బాగ్దాద్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమాని మరణించాడు. ఆయన మరణానికి ప్రతీకారంగా ఇరాక్ లోని అమెరికా సైన్యంపై ఇరాన్ బలగాలు బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించింది.

అయితే అమాయకులైన సైనికులని చంపాలనే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ చెబుతోంది. కానీ , తమ లక్ష్యం మాత్రం డొనాల్డ్ ట్రంప్ అని.. ఆయనను చంపేందకు ఎదురు చూస్తున్నామని గార్డ్స్ కమాండర్ తెలిపారు. సులేమాని హత్యకు ఆర్డర్స్ ఇచ్చిన అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి, ఆ దేశ కమాండర్లను కూడా ప్రాణాలతో ఉంచబోమని ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

 

Iranian Armed Forces Chief of Staff Major General Mohammad Bagheri and IRGC Aerospace Force Commander Amir Ali Hajizadeh walk during the unveiling of "Kheibarshekan" missile at an undisclosed location in Iran

ఉద్రిక్తతలు తీవ్ర స్ధాయికి..

 

ఉక్రెయిన్ జరుగుతున్న యుద్ధంలో .. ఇరాన్ తయారు చేసిన క్షిపిణులనే రష్యా వాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంంలో పశ్చిమ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కాగా, సులేమాని మరణం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్ధాయికి చేరుకున్నాయి. అమెరికా పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇది వరకే ప్రకటించింది.

ఈ నేపథ్యంలో రష్యాతో స్నేహం పెంచుకుంటున్న ఇరాన్.. మాస్కోకు డ్రోన్లను కూడా సరఫరా చేసింది. ఉక్రెయిన్ నపై యుద్దంలో రష్యా ఆ డ్రోన్లను ఉపయోగించింది.

దీంతో అమెరికాతో పాటు పశ్చిమ దేశాలన్నీ ఆందోళనకు గురి అవుతున్నాయి.

అయితే, తాజాగా ఇరాన్ క్రూయిజ్ మిస్సైల్ ను అభివృద్ధి ని చేయడం మరింత ఆందోళన కలిగించే విషయం.