Published On:

Protest against to Donald Trump: డొనాల్ట్‌ ట్రంప్‌ వివాదాస్పదమైన నిర్ణయాలు.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న అమెరికా ప్రజలు

Protest against to Donald Trump: డొనాల్ట్‌ ట్రంప్‌ వివాదాస్పదమైన నిర్ణయాలు.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న అమెరికా ప్రజలు

‘Hands Off’ protesters rally across US to against America President Donald Trump’s Policies: అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్ట్‌ ట్రంప్‌ తీసుకుంటున్న వివాదాస్పదమైన నిర్ణయాలు అమెరికా ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై సుంకం బాదడం మొదలుపెట్టాడు. దీంతో దేశంలో ప్రతి వస్తువు ఖరీదైన వ్యవహహారంగా మారింది. ధరలు మరింత పెరుగుతాయన్న ఆందోళనతో ప్రజలు సూపర్‌ మార్కెట్లపై పడి ఉన్న వస్తువులను ఖాళీ చేశారు. ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలకు అమెరికాలోని 50 రాష్ట్రాల ప్రజలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు.

 

దేశ వ్యాప్తంగా అమెరికా ప్రజలు ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఈ ఏడాది జనవరిలో ప్రెసిడెంట్‌గా బాద్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు రెడ్డెక్కి నిరసన తెలపడం ఇదే మొదటిసారి. ‘హ్యాండ్స్‌ ఆఫ్‌’ పేరుతో మొదలైన నిరసనలు దేశంలోని 50 రాష్ట్రాల్లో పన్నెండు వందల లొకేషన్లలో నిరసన ర్యాలీలు చేపట్టారు. వేలాది మంది ప్రజలు బాస్టన్‌, షికాగో, లాస్‌ ఏంజిల్స్‌, న్యూయార్కు, వాషింగ్టన్‌ డీసీలతో పాటు ఇతర నగరాల్లో నిరసనలు తెలిపారు. వీరంతా ట్రంప్‌ తీసుకుంటున్న సామాజిక , ఆర్థికపరమైన అంశాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ప్రెసిడెంట్‌ డొనాల్ట్‌ ట్రంప్‌ దిగుమతి సుంకాన్ని పెద్ద ఎత్తున పెంచడం పట్ల ఇతర దేశాల్లో కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి. లండన్‌, పారిస్‌, బెర్లిన్‌లో కూడా ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై అక్కడ కూడా ప్రజలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. ఇక బాస్టన్‌ పాల్టొన్న పలువురు నిరసన కారులు ట్రంప అడ్మినిస్ర్టేషన్‌ తీసుకుంటున్న ఇమ్మిగ్రేషన్‌ రెయిడ్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలోని యూనివర్శిటీ విద్యార్థులపై దాడులు చేసి వారిని అరెస్టు చేసివారి వారి దేశాలకు బలవంతంగా తరలించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని.. అందుకే నిరసనల్లో పాల్గొన్నామని పలువురు విద్యార్థులు తెలిపారు.

 

ఓజ్టర్క్ ను బాస్టన్‌ ఏరియాలోని టుఫ్ట్స్‌ యూనివర్శిటీ సమీపంలో ముసుగు వేసుకుని వచ్చిన అమెరికా ఏజంట్లు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా పలువురు లా స్టూడెంట్స్‌ నిరసనలకు దిగారు. విద్యార్థులను చట్ట వ్యతిరేకంగా అరెస్టు చేసి వారిని బలవంతంగా వారి దేశాలకు పంపడాన్ని పలువురు విద్యార్థులు వ్యతిరేకించారు. ఇక లండన్‌లో నిరసన కారులు ‘WTAF America?”, “Stop hurting people” “He’s an idiot”.అంటూ నినాదాలు చేశారు. అలాగే కెనడాపై చేతులు వేయవద్దు, గ్రీన్‌ ల్యాండ్‌పై చేతులు వేయవద్దు, అలాగే ఉక్రెయిన్‌పై చేతులు వేయవద్దు అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కాగా ట్రంప్‌ తరచూ కెనడాను అమెరికాలో విలీనం చేసుకుంటానని… 51వ రాష్ర్టంగా చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడేవాడు. అలాగే గ్రీన్‌ల్యాండ్‌ ను లేకోవర్‌ చేసుకుంటానంటున్నాడు. ఇక ఉక్రెయిన్‌ విషయానికి వస్తే జెలెన్‌ స్కీని బకరా చేసి అక్కడి ప్రకృతి సంపదను పూర్తిగా లూటీ చేద్దామనుకుంటున్నాడు. రష్యాతో శాంతి చర్చల పేరుతో జెలెన్‌ స్కీని కాళ్లబేరానికి రప్పించుకుంటున్నాడు. ఇవన్నీ అమెరికా ప్రజలతో పాటు యావత్‌ ప్రపంచ ప్రజలకు నచ్చడం లేదు. ట్రంప్‌ వైఖరిని స్వదేశంలో ఆయన ప్రజలే వ్యతిరేకిస్తున్నారు.

 

ఇక వాషింగ్టన్‌ డీసీలో వేలాది మంది నిరసనకారులు డెమోక్రాటిక్‌ సెనేటర్ల ప్రసంగాలు వినడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. ట్రంప్‌ అడ్మినిస్ర్టేషన్‌ను వెనకుండా నడిపించేది సంపన్నులైన డోనర్స్‌ ప్రధానంగా ఎలాన్‌ మస్క్‌ లాంటివారని డెమోక్రాటక్‌ సెనేటర్లు మండిపడ్డారు. ప్రస్తుతం మస్క్‌ ట్రంప్‌కు సలహాదారుడుగా ఉన్నారు. మస్క్‌వచ్చిరాగనే ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేయడం మొదలు పెట్టారని డెమోక్రాటక్‌ సెనేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఫ్లోరిడాలో కాంగ్రెస్‌మెన్‌ మాక్స్‌వెల్‌ ప్రోస్ట్‌ ప్రభుత్వాన్ని బిలయనీర్లు టేకోవర్‌ చేశారని మండిపడ్డారు. ప్రజల నుంచి వారి హక్కులను దొంగిలిస్తే.. ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. అవకాశం వచ్చినప్పుడు తమ ప్రతాపం బ్యాలెట్‌ బాక్స్‌లో చూపిస్తారు లేదా.. రోడ్డుపైకి వచ్చిన నిరసన తెలుపుతారని మాక్స్‌ వెల్‌ అన్నారు. ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్‌ పార్టీకి క్రమంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. ఫ్టోరిడా కాంగ్రెస్సెనల్‌ ఎలక్షన్‌ అతి కష్టంగా మీద గెలవాల్సి వచ్చింది. ఇక విస్కాన్‌సిన్‌ సుప్రీంకోర్టు జడ్జి డెమోక్రాటిక్‌ల పరం అయ్యింది. డెమోక్రాటిక్‌ జడ్జిని ఓడించడానికి మస్క్‌ 20 మిలిటయన్‌ డాలర్లు ఖర్చు చేసినా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది.

 

ఇక ట్రంప్‌ విషయానికి వస్తే అధికారం పగ్గాలు చేపట్టి రెండున్నర నెలలు కాలేదు అప్పుడే ఆయన అప్రూవల్‌ రేటింగ్‌ స్వల్పంగా కుంగింది. రాయిటర్స్‌/ఎల్‌పీఎస్‌ఓఎస్‌ పోల్‌ ఇటీవల విడుదల చేసిన అప్రూవల్ రేటింగ్‌ 43 శాతానికి దిగివచ్చింది. ట్రంప్‌ జనవరిలో రెండవసారి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతి తక్కువ రేటుగా నమోదు చేసుకోవడం ఇదే మదటిసారి. దేశ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహిస్తున్నారని కేలం 37 శాతం అనుకూలంగా ఆయనకు ఓటు వేశారు. అలాగే ధరలు తగ్గించడానికి ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనని 30 శాతం మంది ఓటు వేశారు. ఇక హార్వర్డ్‌ క్యాప్స్‌ / హారీస్‌ నిర్వహించిన పోల్‌లో 49 శాతం మంది ట్రంప్‌ పనితీరు బేషుగ్గా ఉందన్నారు అయితే అంతకు ముందు నెలలో 52 శాతం మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. అయితే 54 శాతం మంది మాత్రం మాజీ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ కంటే మెరుగైన పనితీరును ట్రంప్‌ ప్రదర్శిస్తున్నారని కితాబిచ్చారు. వాషింగ్టన్‌ డీసీ నిరసనల్లో పాల్గొనడానికి వచ్చిన వారిలో చాలా మంది తమకు ప్రజాస్వామ్యయుతంగా లభించిన హక్కులను కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.

 

ప్రభుత్వం ఉద్యోగుల్లో కోతలు విదిస్తూపోతే ఎలా అంటూ చాలా మంది నిరసన కారులు ట్రంప్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. చాలా మంది రిటైర్మెంట్‌, ఎడ్యూకేషన్‌ బెనిఫిట్‌లలో కోత విధిస్తారేమో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిరసన కారులను మీరు చేపట్టిన నిరసనలు ట్రంప్‌ చెవికి ఎక్కుతాయో అని మీడియా ప్రశ్నిస్తే.. ట్రంప్‌ శనివారం నాడు ఆఫీసుకు రాడు సెలవు తీసుకుంటాడు. ఫ్లోరిడాలో దినమంతా గోల్ప్‌ ఆడుతాడు. ఆదివారం నాడు అదే పనిచేస్తాడు. ఇదిలా ఉండగా వైట్‌ హౌస్‌ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ట్రంప్‌ అమెరికా ప్రజల ప్రయోజనాలు కాపాడుతాడని.. అలాగే మెడికేర్‌ ప్రోగ్రాంను కొనసాగిస్తాడన్నారు. డెమోక్రాటిక్‌ల మాటనలు నమ్మరాదని హెచ్చరించారు. ప్రెసిడెంట్‌ ట్రంప్‌కు స్పష్టమైన విజిన్‌ ఉంది. ఆయన ఎల్లప్పుడూ సోషల్‌ సెక్యూరిటి, మెడికేర్‌తో పాటు మెడిక్‌ ఎయిడ్‌ లబ్ధిదారుల ప్రయోజనాలను యధావిధిగా కొనసాగిస్తాడన్నారు. అయితే డెమోక్రాటిక్‌లుల సోషల్‌ సెక్యూరిటీ, మెడిక్‌ ఎయిడ్‌లు అక్రమ వలసదార్లు కూడా ఇస్తోందని దీంతో అమెరికాను దివాలా తీయించాలని డెమోక్రాటిక్‌లు కంకణం కట్టుకున్నారని వైట్‌ హౌస్‌ ఒక ప్రకటనలో గతంలోని బైడెన్‌ ప్రభుత్వంపై మండిపడింది.

 

అమెరికా సీనియర్‌ సిటిజన్ల ప్రయోజనాలను డెమోక్రాటిక్‌లు కాలరాయడానికి యత్నించారని వైట్‌ హౌస్‌ ప్రకటనలో విమర్శించింది. ఇదిలా ఉండగా ట్రంప్‌ ఇమ్మిగ్రేషన్‌ సీనియర్‌ సలహాదారుడు టామ్‌ హోమాన్‌…. ఫాక్స్‌ న్యూస్‌తో శనివారం నాడు మాట్లాడారు. నిరసన కారులు శనివారం న్యూయార్కులో తన ఇంటి బయట నిరసన తెలిపారు. ఆ సమయంలో తాను వాషింగ్టన్‌ డీసీలో ఉన్నానని చెప్పాడు. నిరసన కారులు ఖాళీగా ఉన్న ఇంటి ముందు నిరసన తెలియజేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నిరసన కారుల ఆందోళన వల్ల అధికారులు తాము చేయాల్సిన పనులు చేయలేకపోతున్నారని, వారి విధులకు అడ్డుతగులుతున్నారని టామ్‌ అన్నారు. నిరసనలు ర్యాలీ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. వాక్‌ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్‌ సలహాదారుడు అసహనం వ్యక్తం చేశాడు. మీరు రోడ్డెక్కి నిరసనలు తెలిపినా.. ర్యాలీలు నిర్వహించాని వాస్తవాలు మార్చలేరు కదా అంటూ నిరసన కారులను .. అలాగే డెమోక్రాటిక్‌ పార్టీని ప్రశ్నించారు.

 

మొత్తానికి చూస్తే.. ట్రంప్‌ తీసుకుంటున్న వివాదస్పదమైన నిర్ణయాలు ఇతర దేశాలతో పాటు స్వదేశంలో కూడా వ్యతిరేక ఊపందుకుంటోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై భారీ ఎత్తున పన్నులు విధించడం వల్ల దేశంలో ప్రతి వస్తువు ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. దీంతో ప్రజలు ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో సూపర్‌మార్కెట్లకు పరుగులు తీసి అందిన కాడికి సామనులు కొనుగోలు చేశారు. సూపర్‌ మార్కెట్లో నిమిషాల్లో షెల్ప్‌లు ఊడ్చేస్తున్నారు. మరో పక్క దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతందని ప్రజలు వణికిపోతున్నారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ట్రంప్‌ జవాబు చెప్పాల్సిందే. లేదంటే ఆయన అప్రూవల్‌ రేటింగ్‌ మరింత పడిపోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.. వెకప్‌ మిస్టర్‌ ప్రెసిడెంట్‌… బెటర్‌ లేట్‌ దెన్‌ నెవర్‌…! యాస్ట్‌ ఫాస్ట్‌.. యాక్ట్‌ సూన్‌ అంటున్నారు అమెరికా ప్రజలు…! మరి ట్రంప్‌ చెవికి ఇవి ఎక్కుతాయో లేదో వేచి చూడాల్సిందే…!