Donald Trump Offer: అమెరికా అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..!

Donal Trump Bumper Offer to Illegal Immigrants: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై జులుం విదిలిస్తోంది. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ అక్రమ వలస దారులపై ఫోకస్ పెట్టి వారి పట్ల కఠినంగా వ్యవహిరిస్తున్నారు. పలు దేశాలకు చెందిన వందలాది మంది అక్రమ వలసదారులను ఆమెరికా నుంచి తిరిగి పంపిస్తున్నారు. దీంతో అమెరికాకు అక్రమంగా వెళ్లిన వారంత బిగ్గుబిగ్గుమంటు జీవిస్తున్నారు. ఎప్పుడెప్పుడు అధికారులకు చిక్కుతామో, తిరిగి స్వదేశానికి వెళ్లాల్సిందేనా? అని ఆందోళన చెందుతున్నారు.
ట్రంప్ స్వీయబహిష్కరణ కార్యక్రమం
ఈ క్రమంలో అమెరికా అక్రమ వలసదారులకు తాజాగా ట్రంప్ ట్రంప్ శుభవార్త చెప్పారు. తమ దేశంలో అక్రమంగా ఉంటూ స్వీయ బహిష్కరణ చేసుకోవాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ ఇటీవల అక్కడి వార్తా సంస్థకు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటూ నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారులు దృష్టి సారించారని చెప్పారు. అలాగే చట్ట విరుద్దంగా ఇక్కడ ఉంటున్న సాధారణ పౌరుల కోసం స్వీయబహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
విమాన ఖర్చులు మావే
అలా వెళ్లాలనుకునేవారికి తమ ప్రభుత్వం విమాన ఖర్చులతో పాటు కొంత నగదును అందిస్తామని ప్రకటించింది. అనంతరం వెళ్లిపోయినవారిలో సాధారణ పౌరులు ఉంటే వారిని వెనక్కి తీసుకోవడంపై ట్రంప్ స్పందించారు. దేశం నుంచి అక్రమ వలసదారులన పంపించడమే తమ లక్ష్యమన్నారు. అయితే వెళ్లిపోయిన వారిలో మంచి వారు ఉండి, సముచితమని భావిస్తే చట్టపద్దతిలో వెనక్కి తిరిగిరావడానికి కూడా అనుమతిస్తామన్నారు. కాగా అధికారం చేపట్టినప్పటి నుంచి ట్రంప్ అక్రమ వలసదారులపై దేశం నుంచి పంపించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.
కఠిన నిర్ణయాలతో వారిని తిరిగి స్వదేశాలను సాగనంపుతున్నారు. దీంతో అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవల యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సతైం వలసదారులకు హెచ్చరికలు జారీ చేసిది, అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్నవారు ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని నిబంధనను పెట్టింది. ఈ నిబంధన ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి జరిమానా, జైలు శిక్ష విధిస్తామని హెచ్చిరించింది.