Trump tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. చైనా వస్తువులపై భారీగా టారిఫ్ పెంపు

America President Donald Trump big shock to china, 245 percent tariff on china imports: అగ్ర రాజ్యం అమెరికా, చైనాల మధ్య గత కొంతకాంగా టారిఫ్ విషయంలో పెద్ద వార్ జరుగుతోంది. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దేశానికి మరో బిగ్ షాక్ ఇచ్చాడు. ఇప్పటికే ఆ దేశం దిగుమతి వస్తువులపై 145 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా, అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
చైనా వస్తువులపై సుంకాన్ని ట్రంప్ ప్రభుత్వం 145 శాతం నుంచి 245 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు యూఎస్‌లో ఆకాశాన్ని అంటనున్నాయి. ఫలితంగా అమెరికాలో నివసిస్తున్న ప్రజలు చైనా వస్తువులను కొనుగోలు చేయడం ఆపేస్తారు. ఇలా జరిగితే ఆ దేశ కంపెనీలు విపరీతంగా నష్టపోనున్నాయి. కాగ, అమెరికా వస్తువులపై చైనా దేశం 125 శాతం టారిఫ్స్ విధిస్తుంది.
ఇదిలా ఉండగా, అమెరికా వస్తువులపై చైనా ప్రతీకారంగా టారిఫ్స్ పెంచేసింది. ఈ నేపథ్యంలో చైనాపై టారిఫ్స్ పెంచినట్లు అమెరికా వైట్ హౌస్ పేర్కొంది. అయితే తొలుత అమెరికా దిగుమతి టారిఫ్ పెంచింది. ఈ తరుణంలో చైనా ఓ నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన ఓ సంస్థ బోయింగ్ ఉత్పత్తి చేస్తున్న విమానాలు కొనుగోలు చేయవద్దని చైనా తమ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాతి రోజూ అమెరికా దేశం సైతం ప్రతీకార చర్యలకు పాల్పడింది. చైనాపై టారిఫ్స్‌ను భారీగ పెంచింది. దీంతో చైనా వస్తువులు కొనుగోలు చేసేందుకు అమెరికన్లు ఆలోచనలో పడ్డారు.