Visakhapatnam: విశాఖలో లోన్ యాప్ ముఠా అరెస్ట్… పాకిస్థాన్ నుంచి ఆపరేట్

Visakhapatnam: విశాఖలో తాజాగా లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. 2 వందల కోట్ల రూపాయల లావాదేవీలు నడుస్తున్నట్టు తెలిపారు. లోన్ యాప్‌ల ద్వారా పలు ముఠాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాయని ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. యాప్‌లో 2 వేల రూపాయల అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడి ద్వారా ఈ కేసు చేధించినట్టు చెప్పారు.
నరేంద్ర భార్య ఫొటోలను సైబర్ నేరగాళ్లు మార్ఫింగ్ చేసి.. ఫ్రెండ్స్, బంధువులకు పంపించారు. అవమానం తట్టుకోలేక పెళ్లైన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దందా పాకిస్థాన్ కేంద్రం నడుస్తోన్నట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు ఇండియా నుంచి 9 వేల మంది మోసపోయినట్టు చెప్పారు. నిందితుల నుంచి 18 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ ట్యాప్, 54 సిమ్ కార్డులు, 60 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
దాయాది దేశంతో నిత్యం ఏదో సమస్య వెంటాడుతూనే ఉంది. అందులో ఇప్పుడు పాకిస్థాన్ నుంచి ఏపీలో ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ అంటే అందరూ షాకింగ్ కు గురవుతున్నారు. పైగా 200 కోట్ల లావాదేవీలు నడిచాయంటే ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారోనని పోలీసులు ఎక్వైరీ చేస్తున్నారు.
పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇప్పటికే యుద్ధవాతావరణం కనిపిస్తోంది. అలాంటి సమయంలో పాకిస్థాన్ నుంచి లోన్ యాప్ భారత్ లో నడుస్తుందంటే పెద్దకుట్రగా భావిస్తు్న్నారు. అయితే పహల్గాం చర్యకు ప్రతి చర్యగా భారత్ దౌత్య సంబంధాలను కఠినతరం చేసింది. దీంతో పాకిస్థాన్ ఆర్థికపరిస్థితి దిగజారిపోయింది. భారత్ ధాటికి ఒక్కరోజులోనే పాకిస్థాన్ స్టాట్ మార్కెట్ ను మూసేశారు. అయితే లోన్ యాప్ ల ఉచ్చులో ప్రజలు పడొద్దని అంటున్నారు పోలీసులు. ఎవరైతే బ్లాక్ మెయిల్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రాణాలు తీసుకోవద్దన్నారు.