Published On:

IPL 2025 : టాస్ గెలిచిన ఆర్సీబీ.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రజత్ పాటిదార్

IPL 2025 : టాస్ గెలిచిన ఆర్సీబీ.. బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ రజత్ పాటిదార్

IPL 2025 : ప్లేఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసే మరో మ్యాచ్ ప్రారంభం అయింది. టాప్-2లో స్థానం కోసం పోటీపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య అరుణ్ జైట్లీ మైదానంలో బిగ్ ఫైట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీకి తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉండటంతోపాటు బౌండరీ చిన్నగా ఉంది. రెండు జట్లల్లో భారీ హిట్టర్లు ఉన్నారు. దీంతో పరుగుల వర్షం కురవనున్నది. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకోవడం మంచిదే. ఎందుకంటే అరుణ్ జైట్లీ స్టేడియంలో చేజింగ్ చేయడం సులువు.

 

ఢిల్లీ జట్టు : ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్‌ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్ ఉన్నారు.

ఆర్సీబీ జట్టు : విరాట్ కోహ్లి, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి: