Published On:

CM Chandrababu: ఆంధ్రులు గర్వించేలా అమరావతి నిర్మాణం

CM Chandrababu: ఆంధ్రులు గర్వించేలా అమరావతి నిర్మాణం

అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మే 2వ తేదీన జరిగే సభ ఏర్పాట్లపై ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని మండిపడ్డారు.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే గత ప్రభుత్వ కారణంగా నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధాని మోదీ కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

 

రాజధాని నిర్మాణం ప్రతీ పౌరుడు గర్వపడేలా ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ తో కూడుకున్నది. దీన్ని ఎవరూ దెబ్బతీయలేరు. అన్ని వర్గాల వారికి ఉపాది అవకాశాలను కల్పించే ప్రాంతంగా మారుతుంది. అందుకే అమరావతి పనులను ప్రధాని మోదీ చేతుల మీదుగా పున:ప్రారంభింపజేస్తున్నామన్నారు.

 

మే2న రాజధానిలో ప్రధాని పాల్గొనే సభకు ప్రజలు చాలా మంది వస్తారని ఎండాకాలం కావున దూర ప్రాంతాలనుంచి వచ్చే ప్రజలకు కావలసిన మంచినీరు, ఆహారం అందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గ్రామీన ప్రాంతాలనుంచి ప్రజలు ఎక్కువగా సభకు హాజరవుతారు కావున రవాణా సౌకర్యాలను కల్పించాలన్నారు.

 

ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల, అనగాని ప్రసాద్, కొల్లు రవీంద్ర, నారాయణ, మనోహర్ సత్యకుమార్ తో పాటు, డీజీపీ గుప్తా పలువురు అధికారులు హాజరయ్యారు.