Home / latest international news
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సుమారుగా 60 మంది మరణించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. నిరాశ్రయులకు షెల్టర్ జోన్ గా ఉన్న పాఠశాల, మరొక ప్రాంతంపై ఈ దాడులు జరిగాయి. కాగా, దాదాపు 10 నెలలుగా కొనసాగుతున్న వివాదంలో కాల్పుల విరమణ చర్చలు మరోసారి నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
: ఒమన్‌లోని ఇమామ్ అలీ మసీదు సమీపంలో జరిగిన కాల్పుల్లో ఒక భారతీయుడుతో సహా ఆరుగురు మరణించగా 28 మంది గాయపడ్డారు. జూలై 15న మస్కట్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడని, మరొకరు గాయపడ్డారని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
16 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న చమురు నౌక ఒమన్ సముద్రంలో బోల్తా పడిందని మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ మంగళవారం తెలిపింది. ప్రెస్టీజ్ ఫాల్కన్ అనే పేరు ఈ నౌకలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని ఒమానీ కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీ సందర్భంగా హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే, చైనీస్ రిటైలర్లు మరియు ఆన్లైన్ దుకాణాలు ట్రంప్ ఫోటోలతో కూడిన టీ-షర్టుల అమ్మకాలను ప్రారంభించాయి.
సెంట్రల్ గాజాలోని నుసిరత్ క్యాంప్‌లో శరణార్దుల శిబిరంగా నిర్వహించబడుతున్న పాఠశాలపై ఇజ్రాయెల్ మిలటరీ చేసిన దాడుల్లో 15 మంది మరణించినట్లు గాజా లోని సివిల్ డిఫెన్స్ ఏజన్సీ తెలిపింది.
హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ డెయిఫ్ లక్ష్యంగా జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో దక్షిణ గాజాలో శనివారం కనీసం 71 మంది పాలస్తీనియన్లు మరణించారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.ఖాన్ యూనిస్ సమీపంలోని భవనంలో డీఫ్ దాక్కున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత డెయిఫ్ మరణించాడా లేదా అన్నది అస్పష్టంగా ఉందని భద్రతా అధికారి ఒకరు తెలిపారు.
ఉత్తర-మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోవడంతో 20 మందికి పైగా విద్యార్థులు మరణించగా, పలువురు గాయపడ్డారు, శిధిలాలకింద 100 మందికి పైగా చిక్కుకున్నారని వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ 'ప్రచండ' శుక్రవారం పార్లమెంటులో తన ప్రభుత్వం పై పెట్టిన అవివిశ్వాస తీర్మానంలో ఓటమి పాలయ్యారు. ప్రభుత్వానికి అనుకూలంగా 63 ఓట్లు రాగా వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర మెక్సికన్ రాష్ట్రమైన తమౌలిపాస్‌లోని పట్టణ ప్రాంతంలో సుమారుగా 200 మొసళ్ళు ప్రవేశించాయని అధికారులు తెలిపారు. జాన్ నుంచి ఇప్పటి వరకు బెరిల్ హరికేన్ ఇతర తుఫాన్లతో ఇక్కడ కుండపోత వర్షాలు కురిసాయి
జపాన్‌లోని యమగటా ప్రిఫెక్చర్లో స్థానిక ప్రభుత్వం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రజలు ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా నవ్వాలని పిలుపునిస్తూ ఆర్డినెన్స్‌ను ఆమోదించింది.