Published On:

Gold Card : ట్రంప్‌ కలల ప్రాజెక్ట్‌ గోల్డ్‌కార్డ్‌ త్వరలో విక్రయాలు.. డోజ్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ

Gold Card : ట్రంప్‌ కలల ప్రాజెక్ట్‌ గోల్డ్‌కార్డ్‌ త్వరలో విక్రయాలు.. డోజ్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ

Gold Card : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కలల ప్రాజెక్టు అయిన గోల్డ్‌కార్డ్‌ త్వరలో విక్రయాలకు సిద్ధం కానుంది. ఈ విషయాన్ని ఆ వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ ప్రకటించారు. మరోవైపు యూఎస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ సారథి ఎలాన్‌ మస్క్‌ గోల్డ్ కార్డ్ తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సంపన్న వలసదారులకు దీనిని విక్రయించేలా ప్రత్యేక వ్యవస్థను నిర్మిస్తున్నారు. మస్క్‌ బృందంలోని ఇంజినీర్లు కార్డ్‌ అప్లికేషన్‌ ప్రాసెస్‌కు సంబంధించిన కీలక ప్రక్రియను తయారు చేస్తున్నారు. విషయాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక కథంలో పేర్కొంది.

 

అమెరికా డొనాల్డ్ ట్రంప్‌ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత సంపన్నులకు యూఎస్ పౌరసత్వం పొందే ప్రత్యేక మార్గాన్ని ప్రకటించారు. దాన్నే గోల్డ్‌కార్డుగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక నమూనాను ట్రంప్‌ ఇటీవల ప్రదర్శించారు. దీనిపై డొనాల్డ్ ట్రంప్‌ చిత్రంతోపాటు స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ, జాతీయ పక్షి బాల్డ్‌ ఈగిల్‌ చిహ్నాలు ఉన్నాయి.

 

గోల్డ్‌కార్డ్‌ ప్రాజెక్ట్‌కు మార్కో ఎలెజ్‌, ఎడ్వర్డ్‌ కోరిస్టినె నేతృత్వం వహిస్తున్నట్లు వెల్లడించిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. వీరిద్దరూ వివిధ ఏజెన్సీల అధికారులతో ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీసా, ఇమిగ్రేషన్‌ పాలసీలపై చర్చించారు. గోల్డ్‌కార్డుకు అనువైన విధానం కోసం అన్వేషిస్తున్నారు. సాధారణ వీసా అప్లికేషన్లను బైపాస్‌ చేస్తూ దీన్ని తయారు చేయాలని భావిస్తున్నారు. గతంలో ఓ సందర్భంలో అమెరికా వాణిజ్యశాఖ మంత్రి హోవర్డ్‌ లుట్నిక్‌ కార్డుకు భారీగా గిరాకీ వచ్చిందని, ఒక్కరోజే 1000 కార్డులను విక్రయించినట్లు తెలిపారు. వీటిద్వారా 5 బిలియన్‌ డాలర్లు సేకరించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 3.7 కోట్ల మందికి ఈకార్డు కొనే సామర్థ్యం ఉందని చెప్పారు. వీటికి సంబంధించిన ఎలాంటి ఆర్థిక లావాదేవీలను ఇప్పటివరకూ చూపించలేదు.

 

ఈ కార్డు ప్రస్తుతం ఉన్న ఈబీ-5 వీసాలను గోల్డ్‌కార్డ్‌ భర్తీ చేయనున్నది. గతేడాది ప్రోగ్రాం 4 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని యూఎస్‌కు తీసుకొచ్చింది. ఈబీ-5 ప్రోగ్రామ్‌ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకు వస్తోన్నట్లు తెలిపారు. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

 

 

ఇవి కూడా చదవండి: