Nani 30: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా లాంఛనంగా స్టార్ట్ అయిన నాని కొత్త సినిమా..
నేచురల్ స్టార్ నాని ఇటీవల న్యూ ఇయర్ కానుకగా కొత్త మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నేడు ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో లాంఛనంగా

Nani 30: నేచురల్ స్టార్ నాని ఇటీవల న్యూ ఇయర్ కానుకగా కొత్త మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా నేడు ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, రైటర్ విజయేంద్ర ప్రసాద్, దర్శకులు హను రాఘవపూడి, బుచ్చిబాబు, నిర్మాత అశ్విని దత్ తో పాటు చిత్ర యూనిట్ మరియు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
కొత్త దర్శకుడు ‘శౌర్యువ్’ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో నాని సరసన నాయికగా మృణాళ్ ఠాకూర్ నటించనుంది.
తండ్రీ కూతుళ్ల అనుబంధం చుట్టూ అల్లుకున్న కథ ఇది. వారి ఎమోషన్స్ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది.
మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది.
సాను జాన్ వరుగీస్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు.
ప్రవీణ్ ఆంథోని ఎడిటర్, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.
(Nani 30) ఫస్ట్ క్లాప్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ సీన్ కి క్లాప్ కొట్టగా, విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పేపర్లు అందించాడు.
నిర్మాత అశ్విని దత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హనురాఘవాపుడి మొదటి షాట్ కి దర్శకత్వం వహించాడు.
కాగా ఈ సినిమాలో నాని మరోసారి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో జెర్సీ సినిమాలో ఫాదర్ గా చేసి నాని మార్కులు కొట్టేశాడు.
ఇప్పుడు తండ్రి కూతుళ్ళ కథతో మరోసారి ఆడియన్స్ మనసులను తాకనున్నాడు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.
ఈ కార్యక్రమంలో `పలాస` ఫేమ్ కరుణ కుమార్, గిరీష్ అయ్యర్, దేవా కట్టా, చోటా కె నాయుడు, సురేష్‌బాబు, దిల్‌రాజు, రామ్ గోపీ ఆచంటలు, అనిల్ సుంకర, రవిశంకర్, దివివి దానయ్య, స్రవంతి రవికిశోర్, కెఎస్ రామారావు, సాహు గారపాటి, ఏసియన్ సునీల్ వంటి సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
కొత్త నిర్మాణ సంస్థ అయిన వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తన తొలి ప్రొడక్షన్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనున్నారు చిత్ర యూనిట్.
And!
Our #Nani30 Begins with a Mega clapby the Megastar @KChiruTweets
VijayendraPrasad
SwitchOn @AshwiniDuttCh
1st ShotDir: @hanurpudi,#KishoreTirumala, #VivekAthreya, @BucchiBabuSana,@DirVassishtaNatural
@NameisNani @mrunal0801 @shouryuv @HeshamAWMusic @VyraEnts pic.twitter.com/MyL2H2zHge
— Vyra Entertainments (@VyraEnts) January 31, 2023
కాగా మరోవైపు నాని నటిస్తున్న దసరా సినిమాని విడుదలకు సిద్దం చేస్తున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ ని నిన్న రిలీజ్ చేశారు మేకర్స్.
టీజర్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేసింది.
ఈ సినిమాకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
తెలంగాణ సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ సినిమాలి నాని డైలాగులు గూస్ బంమ్స్ తెప్పిస్తున్నాయి.
ఈ సినిమాని మార్చి 30వ తేదీన పాన్ ఇండియా మూవీలా తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల చేయబోతున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/
ఇవి కూడా చదవండి:
- It Raids: కలవరపెడుతున్న ఐటీ దాడులు.. హైదరాబాద్ లో మరోసారి సోదాలు
- Terror Attack: పాక్ లో ఆత్మాహుతి దాడి.. 93కు పెరిగిన మృతుల సంఖ్య
- Adani Group: అదానీకి దెబ్బ మీద దెబ్బ.. టాప్ 10 సంపన్నుల జాబితా నుంచి ఔట్