Vishwambhara: కేవలం దానికే రూ. 75 కోట్లా.. ఏం చేస్తున్నావ్ వశిష్ట..?

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వశిష్ట దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.ఈ చిత్రంలో చిరు సరసన త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాదిలోనే విశ్వంభర సందడి చేయడానికి రెడీ అవుతుంది.
బింబిసార సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన వశిష్ట.. మొదటి సినిమాతోనే తన సత్తా చాటి చిరంజీవినే ఇంప్రెస్ చేశాడు. ఇక బింబిసార లాంటి కథతోనే విశ్వంభర కూడా తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.మొదటి నుంచి ఈ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను పోలి ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను మేకర్స్ ఖండించారు. ఈ సినిమాలో ఎక్కువ శాతం సీజీనే ఉపయోగిస్తున్నారట.
అందుతున్న సమాచారం ప్రకారం.. కేవలం సీజీ వర్క్ కోసమే దాదాపు రూ. 75 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది మేకర్స్. మునుపెన్నడూ లేనివిధంగా విశ్వంభర కోసం భారీ సెట్స్ మాత్రమే కాకుండా ఒక కొత్త లోకాన్ని సృష్టిస్తున్నారని టాక్ నడుస్తోంది. దానికోసమే కోట్లలో ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. కేవలం సీజీకే రూ. 75 కోట్లు అంటే.. సినిమా మొత్తం పూర్తయ్యేసరికి ఎంత అవుతుంది అనేది చూడాలి. ఇప్పటికే అనుకున్న బడ్జెట్ కన్నా రూ. 20 కోట్లు ఎక్కువ అయ్యిందని టాక్ నడుస్తోంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. VFX బాగా రావాలని చూస్తున్నారట మేకర్స్.
ఇక విశ్వంభర సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. గతేడాది మొత్తం చిరు వెండితెరపై కనిపించింది లేదు. అంతకుముందు వాల్తేరు వీరయ్య అంటూ వచ్చి హిట్ అందుకున్నా .. భోళా శంకర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు చిరు. అందుకే ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. డబ్బు ఖర్చు అయినా కంటెంట్ బావుండి ట్రోల్ అవ్వకుండా ఉంటే చాలు అని చెప్పుకొస్తున్నారు.
ఇక విశ్వంభర తరువాత చిరు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా దిగనుంది. మరి ఈ సినిమాలతో చిరు ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- Simran hit Back Female Co-Star: అలాంటి పాత్రల కంటే ఆంటీ రోల్స్ ఉత్తమం – జ్యోతికకు సిమ్రాన్ కౌంటర్!