Anil Ravipudi: చిరు సినిమా.. రేటు పెంచేసిన రావిపూడి.. ?

Anil Ravipudi: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ప్రస్తుతం టాప్ లో ఉన్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. జూనియర్ జంధ్యాలగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి నటించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి.. దాదాపు రూ. 300 కోట్లు రాబట్టింది. మొదటిసారి వెంకటేష్ ను వంద కోట్ల క్లబ్ లో చేరింది.
ఇక ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి రేంజ్ పెరిగిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరువాత అనిల్ కు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఈ మధ్యనే చిరు- అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కింది. ఇక నేడు ఈ సినిమా కోసం పనిచేస్తున్న టెక్నీషియన్స్ ను పరిచయం చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు.
ఇదంతా పక్కన పెడితే.. చిరు సినిమాకు అనిల్ రావిపూడి రేటు పెంచినట్లు తెలుస్తోంది. సాధారణంగా హీరో, హీరోయిన్లు.. ఒక భారీ హిట్ అందుకోగానే రెమ్యూనరేషన్స్ పెంచేస్తూ ఉంటారు. అలా డైరెక్టర్స్ కూడా హిట్ పడగానే ఒక్కసారిగా రెమ్యూనరేషన్స్ పెంచేస్తున్నారు. మొన్నటివరకు సుకుమార్, ప్రశాంత్ నీల్, అట్లీ అలా పెంచేశారని వార్తలు వినిపించాయి.
ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా చిరంజీవి సినిమాకు పారితోషికం పెంచేసాడట. ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు, రూ. 12 కోట్లు అందుకుంటున్న అనిల్.. ఒక్కసారిగా చిరు సినిమాకు రూ. 20 కోట్లు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ.. కొంతమంది మాత్రం తప్పు లేదు.. హిట్ ఇస్తే అదే చాలు అని చెప్పుకొస్తున్నారు.
పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి డైరెక్టర్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు. మొదటి సినిమాకు ఆయన రూ. 50 లక్షలు తీసుకున్నాడని సమాచారం. ఇక ఇప్పుడు రూ. 20 కోట్లు తీసుకుంటున్నాడు. 7 సినిమాలు.. 7 హిట్స్. ఇన్నేళ్ళలోఆమాత్రం పెంచడంలో తప్పు లేదు అని కొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో అనిల్ రావిపూడి.. వెంకటేష్ కు హిట్ ఇచ్చినట్లే మెగాస్టార్ కూడా ఇస్తాడేమో చూడాలి.