Published On:

Hit 3: సినిమానే కాదు.. ప్రమోషన్స్ కూడా చాలా వైలెంట్ గురూ

Hit 3: సినిమానే కాదు.. ప్రమోషన్స్ కూడా చాలా వైలెంట్ గురూ

Hit 3: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతోనే క్లాసు.. వరుస హిట్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.  ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా హిట్లు మీద హిట్లు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే ఆయన నిర్మాణంలో వచ్చిన కోర్ట్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక  తాజాగా నాని నటిస్తున్న చిత్రం హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మే 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఇప్పటికే హిట్ 3 చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి . రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ఇంటర్వ్యూలను ఈసారి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. సినిమా థీమ్ ను బట్టి ప్రమోషన్స్ చేయడం చూసే ఉంటారు. వాల్తేరు వీరయ్య సినిమా సమయంలో.. బోట్ సెట్ వేసి ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వహించి షాక్ ఇచ్చారు.

 

అలా సినిమా కథను బట్టి.. ప్రమోషన్స్ చేయడం పరిపాటిగా సాగుతుంది. అందుకు తగ్గట్టే నాని కూడా హిట్ 3 ప్రమోషన్స్ ను మొదలుపెట్టాడు. సినిమా ఎంత వైలెంట్ గా ఉండబోతుందో ట్రైలర్ లోనే చూపించిన మేకర్స్.. తమ ప్రమోషన్స్ లో కూడా అంతే వైలెంట్ ఉంటుందని చూపించారు. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియో లో ఇంటర్వ్యూ ల కోసం గ్రాండ్ సెట్స్  వేశారు. అదొక ఇన్వెస్టిగేషన్ రూమ్ లా తయారుచేశారు.

 

ఆ సెట్ లో గోడ మీద రక్తపు మరకలు, హిట్ 3 అని రాసి ఉంచారు. అంతేకాకుండా సినిమాలో వాడిన కత్తులు, ఆయుధాలు, సంకెళ్లు.. జైలు గదులు ఇలా మొత్తం ఈ సెట్ ను వైలెంట్ గా మార్చేశారు. ఒక్కసారి ఆ సెట్  చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం అని చెప్పాలి. నిజం చెప్పాలంటే.. సినిమాకు ఎంత ఖర్చుపెట్టారో తెలియదు కానీ.. ఈ సెట్ కోసం మాత్రం బాగా ఖర్చుపెట్టారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సెట్ లో నాని, చిత్రబృందం సినిమా గురించి విశేషాలను చెప్పనున్నారు. ప్రస్తుతం ఈ సెట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వైలెంట్ సినిమాతో నాని వైలెంట్ హీరోగా  హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.