Published On:

Jagadeka Veerudu Athiloka Sundari Re Release: రాజు, ఇంద్రజ ఈసారి త్రీడీ మ్యాజిక్ చేయడానికి సరికొత్తగా వస్తున్నారు

Jagadeka Veerudu Athiloka Sundari Re Release: రాజు, ఇంద్రజ ఈసారి త్రీడీ మ్యాజిక్ చేయడానికి సరికొత్తగా వస్తున్నారు

Jagadeka Veerudu Athiloka Sundari Re Release: టాలీవుడ్ లో ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే టక్కున రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది అని టక్కున చెప్పేస్తారు. కొత్త సినిమాలు రిలీజ్ అయితే హడావిడి ఉంటుందో లేదో తెలియదు కానీ.. రీ రిలీజ్ ల హంగామా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అప్పట్లో హల్చల్ చేసిన సినిమాలు .. ఇప్పుడు సరికొత్తగా రీ రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్.. అప్పుడు చేయలేని హంగామా ఇప్పుడు చేస్తున్నారు.

 

సీనియర్ హీరోస్, కుర్ర హీరోలు అని తేడా లేకుండా తమ హిట్ సినిమాలకు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. 1990 సంవత్సరంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక అద్భుతం. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అతిలోక సుందరిగా శ్రీదేవి నటించింది. అసలు నిజంగానే అతిలోక సుందరి ఇలానే ఉంటుందా అని అనిపించేలా శ్రీదేవి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది.

 

శ్రీదేవి మనం మధ్య లేకపోయినా.. ఆమె రూపం ఎప్పటికీ చెరిగిపోదు. ఈ సినిమా రిలీజ్ సమయానికి ఆంధ్రప్రదేశ్ లో వరదలు ముంచెత్తాయి. దీంతో అసలు జనాలు సినిమాకు వస్తారా అనుకున్నారట. కానీ, అశ్వినీ దత్ డేర్ చేసి.. లేట్ అయినా ప్రింట్లు అన్ని చోట్లకు పంపించి రిలీజ్ చేస్తే.. మోకాలు లోతు నీళ్లలో కూడా తడుచుకుంటూ వెళ్లి సినిమా చూశారట ప్రేక్షకులు. చిరు గ్రేస్, శ్రీదేవి అందం, రాఘవేంద్రరావు టేకింగ్.. ఇలా ఒకటి అని చెప్పలేం.. అన్ని కలిపి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను బిగ్గెస్ట్ హిట్ గా నిలిచేలా చేశాయి.

 

ఈ ఏడాది మే 9 కి ఈ సినిమా రిలీజ్ అయ్యి 36 సంవత్సరాలు పూర్తి అవుతాయి. అందుకే అదే రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈసారి సరికొత్తగా 2డీ, 3డీ లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ కాలంలో టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాత సినిమాను సరికొత్తగా సాంకేతికత లోకి మార్చడం ఇదే మొదటిసారి కావచ్చు.

 

ఎంత యూట్యూబ్ లో, ఓటీటీ లో చూసినా.. పెద్ద తెరపై 3డీ లో చూస్తే ఆ మజానే వేరు. ఇంద్ర లోకం నుంచి ఇంద్రజ దిగివస్తున్న దృశ్యాలు.. మన కళ్ల ముందే కనిపిస్తే ఎంత బావుంటుంది. ఇలాంటి అనుభూతిని ప్రేక్షకులు అనుభవించాలని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మే 9 న మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా రీ రిలీజ్ పెద్ద పండగ అనే చెప్పాలి. మరి ఈ సినిమా ఇప్పుడు ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.