Telangana CS : తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Telangana CS : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామృష్ణారావు నియమితులయ్యారు. ఈ నెలాఖరున శాంతి కుమారి ఉద్యోగ విరమణ కానున్నారు. దీంతో రామృష్ణారావుకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 1990 ఐఏఎస్‌కు బ్యాచ్చెందిన రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రామకృష్ణారావు వచ్చే ఆగస్టులో ఉద్యోగ విరమణ కానున్నారు. ప్రస్తుతం ఉన్న ఐఏఎస్‌ల్లో సీనియర్‌గా ఉన్నారు. ఆర్థికశాఖలో ఈయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో అనుభవం ఉంది. దీంతోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు తెలుస్తోంది. రామకృష్ణారావు గతంలో నల్లగొండ జాయింట్ కలెక్టర్‌గా, గుంటూరు కలెక్టర్‌గా కూడా పనిచేశారు.
1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి..
ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఉన్న శాంతికుమారి 1989 ఐఏఎస్బ్యాచ్కు చెందిన అధికారి. జనవరి 11న 2023 నుంచి తెలంగాణ సీఎస్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగ విమరణ అనంతరం శాంతి కుమారిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమించనున్నట్లు వార్తలు వస్తోన్నాయి. శాంతి కుమారి నియామకం ఇప్పటికే ఖరారు అయిందని, అధికారిక ప్రకటన మాత్రమే జరగాల్సి ఉందని తెలిసింది.