Saudi prince : 20 ఏళ్లుగా కోమాలోనే.. కారు ప్రమాదంలో యువరాజుకు తీవ్ర గాయాలు

Saudi prince in coma for 20 years after serious Injuries in car Accident : అతను సౌదీ రాజ కుటుంబంలో పుట్టాడు. రూ.వేల కోట్ల సంపద ఉంది. కానీ, అతడు ఆ సంపదను అనుభవించలేకపోతున్నాడు. యువరాజు ఓ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ క్రమంలోనే 20 ఏళ్లుగా కోమాలోనే ఉన్నాడు. ఏదైనా అద్భుతం జరిగి తమ కుమారుడు మళ్లీ ఈ లోకాన్ని ప్రపంచాన్ని చూస్తాడనే ఆశతో యువరాజు తల్లిదండ్రులు ఆశతో ఎదురుచూస్తున్నారు. సౌదీ యువరాజు అల్ వహీద్ బిన్ ఖలీద్ బిన్ 20 ఏళ్లు గడిచినా ఆరోగ్యంలో ఏ మాత్రం పురోగతి లేదు.
16 ఏళ్ల వయసులో కోమాలోకి..
16 ఏళ్ల వయసులో కోమాలోకి వెళ్లిన యువరాజు.. ఇప్పుడు 36వ అడుగుపెట్టాడు. ఈ నెల 18వ తేదీన అతడికి 35 ఏళ్లు పూర్తయి 36 ఏళ్లులోకి అడుగుపెట్టాడు. బిలియనీర్, యువరాజు ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కుమారుడు అల్-వహీద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్. అతడు బ్రిటన్‌లోని మిలిటరీ కళాశాలలో విద్యనభ్యనించేవాడు. 2005లో జరిగిన ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటిలేటర్‌పై చికిత్స..
2005లో నుంచి కోమాలో ఉన్న యువరాజుకు రియాద్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ మెడికల్ సిటీ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నారు. గడిచినా 20 ఏళ్లుగా కోమాలో ఉంటున్న యువరాజును ‘స్లీపింగ్ ప్రిన్స్’గా పిలుస్తున్నారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న యువరాజు కోలుకునే అవకాశం లేదని వైద్యులు భావించి దానిని తొలగించాలని 2015లో సిఫారసు చేశారు.
నిరాకరించిన తండ్రి..
యువరాజు తండ్రి అందుకు నిరాకరించారు. ఎప్పుడైనా ఏదైనా అద్భుతం జరిగి తన కుమారుడు కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రమాదంలో తన కుమారుడు చనిపోవాలని భగవంతుడు కోరుకుంటే ఇప్పుడు అతడు సమాధిలో ఉండేవాడని, కానీ అలా జరగలేదని చెప్పారు. అల్ వహీద్ తల్లి ప్రిన్సెస్ రీమా తనయుడు కోలుకుంటాడని ఆశతో ఎదురుచూస్తున్నారు. యువరాజు 2019లో ఓసారి కోలుకుంటున్నట్లు కనిపించింది. చేతివేళ్లు కదిలించడం, తలను అటూఇటూ తిప్పడం చేయడంతో కుటుంబంలో ఆశలు చిగురించాయి. కానీ, ఆ తర్వాత ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇటీవల 36 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో యువరాజు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో ఆయన మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు.