Published On:

Chiranjeevi: మా బిడ్డ ఇంటికొచ్చేశాడు.. మీ అందరికీ ధన్యవాదాలు

Chiranjeevi: మా బిడ్డ ఇంటికొచ్చేశాడు.. మీ అందరికీ ధన్యవాదాలు

Chiranjeevi: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన సంగతి తెల్సిందే. స్కూల్ సమ్మర్ క్యాంప్ లో అగ్నిప్రమాదం సంభవించడంతో  మార్క్ చేతులకు కాళ్లకు గాయాలు అయ్యాయి. ఊపిరితిత్తులలోకి  పొగ చేరిందని వైద్యులు తెలిపారు. ఇక వెంటనే కొడుకును చూడడానికి పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు, అన్న అకీరా, అక్క ఆద్య కూడా సింగపూర్ వెళ్లారు.

 

నిన్నటికి నిన్న హాస్పిటల్ లో ఆక్సిజన్ మాస్క్ తో మార్క్  ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న మార్క్.. కొద్దిరోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు. మార్క్ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. వారందరికీ కూడా పవన్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

 

తాజాగా సింగపూర్ వెళ్లిన చిరు.. పవన్ కొడుకు ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ ను ఇచ్చారు. మార్క్ శంకర్ ఇండికి వచ్చేసాడని, తన కోసం ప్రార్దించిన ప్రతి ఒక్కరికి, తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి, మెగా ఫ్యామిలీ  తరపునుంచి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ తో కలిసి దిగిన  ఫోటోలను షేర్ చేశారు.

 

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో  త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే  వుంటాడు.   రేపు  హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద  ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.

 

ఈ  సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా  ప్రాంతాల్లో మార్క్  శంకర్  కోలుకోవాలని ప్రతి  ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వవైరల్ గా మారింది.