Allu Arjun-Atlee Movie: అల్లు అర్జున్-అట్లీ మూవీ.. హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాకుర్!

Mrunal Thakur To Play Female Lead in Allu Arjun and Atlee Movie: ‘పుష్ప 2’ మూవీతో ఇండస్ట్రీని షేక్ చేశాడు అల్లు అర్జున్. ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఇండియన్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది.ఈ దెబ్బతో అల్లు అర్జున్ మార్కెట్ అమాంతం పెరిగింది. ఇప్పుడు బన్నీ క్రేజ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్‌కు వెళ్లింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ హిట్ డైరెక్టర్ అట్లీతో జతకడుతున్నాడు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అల్లు అర్జున్ 22 సినిమాగా ఇది రానుంది. దీంతో AA22-A6 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రకటించారు.
బన్నీ కోసం అట్లీ అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశాడు. సోషియో ఫాంటసి డ్రామాగా ఇది ఉండనుందని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా అతి త్వరలోనే గ్రాండ్‌గా లాంచ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదే ఈ సినిమా అల్లు అర్జున్ హీరోయిన్ ఎవరనేది. ఇందులో బన్నీ సరసన హీరోయిన్ మరాఠి భామ మృణాల్ ఠాకూర్ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆమెను కలిసి కథ కూడా చెప్పారట. ఆమె కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రెమ్యునరేషన్, డేట్స్ విషయంపై చర్చ జరుగుతుంది.
అంతా ఒకే అయితే ఇందులో అల్లు అర్జున్ సరసన మృణాల్ ఠాకూర్ ఫిక్స్ అయినట్టే. ఈ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు. కానీ ఇదే నిజమైతే మాత్రం అల్లు అర్జున్-మృణాల్ జోడి చాలా బాగుంటుంది, వీరిద్దరి కాంబో వెండితెరపై చూడముచ్చటగా ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె, మరో భామ జాన్వీ కపూర్‌లు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారని టాక్. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేయిట్ చేయాల్సిందే.
కాగా అట్లీ దర్శకత్వం తెరకెక్కబోయే ఈ సినిమాను సన్‌పిక్చర్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. టైం ట్రవెల్ సూపర్ హీరోల తలపించేలా ఈ మూవీ ఉంటుందని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. పుష్ప 1, పుష్ప 2 వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా అట్లీ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బన్నీ కోసం ఎలాంటి కథను రెడీ చేశాడు, ఈ సినిమా ఏ రేంజ్‌లో ప్లాన్ చేశాడంటూ అభిమానులంత అంచనాల్లో మునిగితేలుతున్నారు.