Published On:

IPL 2025 : ల‌క్నో న‌డ్డివిరిచిన బుమ్రా.. ముంబయి ఇండియన్స్ ఘన విజయం

IPL 2025 : ల‌క్నో న‌డ్డివిరిచిన బుమ్రా.. ముంబయి ఇండియన్స్ ఘన విజయం

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో భాగంగా ఆల‌స్యంగా పుంజుకున్న ముంబయి ఇండియ‌న్స్ జట్టు పరంపర జోరు కొన‌సాగిస్తోంది. వ‌రుస విజ‌యాల‌తో ప్లే ఆఫ్స్ పోటీదారుగా మారిన ముంబయి.. వాంఖ‌డే మైదానంలో ల‌క్నోను 54 ప‌రుగుల తేడాతో చిత్తుచిత్తూగా ఓడిచింది. మొదట ఓపెన‌ర్ రియాన్ రికెల్ట‌న్ (58), సూర్య‌కుమార్ యాద‌వ్ (54) అర్ధశతకాలతో భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్నోను 161కే పరుగులకే ఆలౌట్ చేసింది. బుమ్రా నాలుగు వికెట్లు తీసి ల‌క్నో మిడిలార్డ‌ర్‌ను నడ్డివిరిచాడు. దాంతో 54 ప‌రుగులు తేడాతో గెలుపొందిన హార్దిక్ పాండ్యా సేన ఆరో విజయం ఖాతాలో వేసుకుంది.

 

ఐపీఎల్‌లో ఐదుసార్లు ట్రోఫీని ఒడిసి ప‌ట్టిన ముంబయి ఇండియ‌న్స్ దుమ్మురేపుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద‌ర‌గొడుతూ వ‌రుస‌గా ఐదో విజ‌యంతో ప్లే ఆఫ్స్ రేసును ఆస‌క్తిక‌రంగా మార్చేసింది. ఆదివారం వాంఖ‌డేలో 215 పరుగులు చేసి.. ల‌క్నోను భ‌య‌పెట్టిన ముంబయి.. బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, బౌల్ట్ మూడు వికెట్లు తీసి జట్టు విజయానికి పునాది వేశారు.

 

 

ఇవి కూడా చదవండి: