Published On:

Sudigali Sudheer: చిరంజీవిని అనే దమ్ము లేక సుధీర్ మీద పడ్డారా.. ?

Sudigali Sudheer: చిరంజీవిని అనే దమ్ము లేక సుధీర్ మీద పడ్డారా.. ?

Sudigali Sudheer:   బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమెడియన్, సింగర్, డ్యాన్సర్, మ్యాజిక్.. ఇలా  మల్టీ టాలెంట్ ఉన్న అంటాడు సుధీర్. గాలోడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న సుధీర్.. ఆ తరువాత గోట్ అనే సినిమాను ప్రకటించాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ దివ్యభారతి నటిస్తోంది.

 

ఇప్పటికే గోట్  సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎప్పుడు ఈ సినిమా రిలీజ్అవుతుందా  అని ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ తగిలింది. బడ్జెట్ ఎక్కువ అవ్వడం వలన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని టాక్. ఇక దీంతో చేసేదేమి లేక సుధీర్ మళ్లీ బుల్లితెరపై  కనిపించడం మొదలుపెట్టాడు.

 

సర్కార్ సీజన్ 4 కి యాంకర్ గా రీఎంట్రీ ఇచ్చిన సుధీర్.. ఈటీవీలో షోస్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక షోలో సుధీర్ చేసిన స్కిట్.. హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. రెండు సీరియల్స్ మధ్య పోటీ పెట్టి ఛాంపియన్ షిప్ గెలిచే షోలో సుధీర్.. ఒక స్కిట్  చేశాడు. సీనియర్ నటి రంభ ఆ షోకు గెస్ట్ గా వచ్చింది.  చిరంజీవి, రంభ జంటగా నటించిన బావగారు బావున్నారా.. సినిమాలోని ఒక సీన్ ను సుధీర్, రంభ రీక్రియేట్ చేశారు.

 

గుడిలో నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తే  రంభ కనిపిస్తుంది. ఆ సినిమాలో ఇది ఐకానిక్ సీన్. ఆ సీన్ నే సుధీర్ చేశాడు. నంది కొమ్ముల నుంచి చూసి..  రంభ కనిపించేసరికి.. నాకేంటి శివుడి దర్శనం కాకుండా అమ్మోరు దర్శనం అయ్యింది అంటూ సుధీర్ డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు  ఇదే సుధీర్ కొంప ముచ్చింది. హిందువుల మనోభావాలను సుధీర్ దెబ్బతీశాడని, పవిత్రమైన నంది కొమ్ముల నుంచి చూస్తే.. శివుడిగా రంభ కనిపించడం ఏంటి.. ? అని ఫైర్ అవుతున్నారు.

 

సుధీర్ ను క్షమించేది లేదని మండిపడుతున్నారు…అయితే  మరికొందరు మాత్రం అది కేవలం సీన్ రీక్రియేట్ చేసారని, బావగారు బావున్నారా.. ? సీన్ ను సుధీర్ చేయడంలో తప్పు లేదని.. అసలు హిందువుల మనోభావాలను దెబ్బతీసింది చిరంజీవి. అంటే ఆయనను అనాలి. చిరును అనలేక.. సుధీర్ ని అంటున్నారా.. ? అని అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి.. అంత రచ్చ చేయలేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి.. తప్పు అయ్యింది. ఇలాంటివి  ఇంకొకరు చేయకుండా ఉంటారు అని కొందరు సమర్థిస్తున్నారు. ఏదిఏమైనా ఎప్పుడో జరిగింది.. రీక్రియేట్  చేసిన పాపానికి సుధీర్ బలి పశువుగా మారాడని నెటిజన్స్కామెంట్స్  పెడుతున్నారు.