Published On:

HIT 3: హిట్ 3 లో మరో స్టార్ హీరో.. చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారే.. ?

HIT 3: హిట్ 3 లో మరో స్టార్ హీరో.. చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారే.. ?

HIT 3:  న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఒకపక్క నిర్మాతగా.. ఇంకోపక్క హీరోగా వరుస విజయాలను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం హీరోగా నాని చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి హిట్ 3.  శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. హిట్ సినిమాతో శైలేష్ కొలను తెలుగుతెరకు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు.

 

మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్.. హిట్ సిరీస్ ను కొనసాగించాలని నిర్ణయించుకొని.. హిట్ 2ను తెరకెక్కించాడు. హిట్ ఎంత హిట్ అయ్యిందో హిట్ 2 అంతకు మించి హిట్ అయ్యింది. హిట్ తెలంగాణలో జరిగితే హిట్ 2 ఆంధ్రాలో జరిగినట్లు చూపించారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో కేస్  ఇంకో రాష్ట్రంలో ఓపెన్ చేశాడు. ప్రతి ఒక్క కేస్ ను ఇంటర్ లింక్ చేస్తూ.. శైలేష్ రాసుకుంటున్న కథలు అద్భుతంగా ఉంటున్నాయి.

 

హిట్ 2 చివర్లోనే నాని ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ లో చూపించాడు. రూత్ లెస్ కాప్ సర్కార్ గా నాని కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పక్కింటి కుర్రాడిలా కనిపించే నానిని.. ఒక బ్రహ్మ రాక్షసుడుగా చూపించాడు శైలేష్. హిట్ 3 లో కూడా పాత రెండు కేసుల ప్రస్తావన ఉండనుందట. హిట్ లో విశ్వక్ సేన్ నటించగా.. హిట్ 2 లో అడివి శేష్ కనిపించాడు.

 

ఇక హిట్ 3 లో  వీరిద్దరూ కూడా సందడి చేయనున్నారట. విశ్వక్ కనిపించకపోయినా అతని పేరు, రిఫరెన్స్ ఉండనుందని, ఒక సీన్ లో అడివి శేష్ ఎంట్రీ ఉండనుందని సమాచారం. ఇలా ముగ్గురు హీరోలు ఈ సినిమాలో దర్శనం ఇవ్వనున్నారు. ఇక ఇంకొక సర్ ప్రైజ్ ఏంటి అంటే.. ఈ ముగ్గురు హీరోలు కాదు చివర్లో నాలుగో హీరో కూడా రానున్నాడట.

 

వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చితెలుగువారికి కూడా సుపరిచితమైన ఒక హీరో కూడా ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది. చివర్లో అతను కనిపించడంతోనే సినిమా ముగియనుందని టాక్. అంటే.. అతనే హిట్ 4 లీడ్ అని అర్ధం. ఇక ఈ విషయం తెలియడంతో ఆ హీరో ఎవరు అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెడుతున్నారు.

 

కొందరు దుల్కర్ సల్మాన్ అంటుంటే.. ఇంకొందరు కార్తీ అని చెప్పుకొస్తున్నారు. మరికొందరు శివ కార్తికేయన్ అని.. కొద్దిమంది సూర్య అని చెప్పుకొస్తున్నారు. మరి హిట్ 3 లో ఉన్న ఆ స్టార్ హీరో ఎవరు.. ? అనేది  తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఇకపోతే ఈ సినిమా మే 1 న రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి: