Last Updated:

CSK vs LSG : ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో లక్నోను చిత్తు చేసిన చెన్నై.. టోర్నీలో ఫస్ట్ విక్టరీ కొట్టిన చెన్నై.

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై అదరగొట్టేసింది. ఇరగదీసే బ్యాటింగ్.. ఆకట్టుకునే బౌలింగ్.. అన్నీ తోడై ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో ఐపీఎల్ 2023 లో ఫస్ట్ విక్టరీ ని అందుకుంది. చెన్నై జట్టు ఇచ్చిన 218 పరుగుల భారీ టార్గెట్ లక్నో ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేసింది.

CSK vs LSG : ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో లక్నోను చిత్తు చేసిన చెన్నై.. టోర్నీలో ఫస్ట్ విక్టరీ కొట్టిన చెన్నై.

CSK vs LSG : ఐపీఎల్ 2023 సీజన్‌లో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై అదరగొట్టేసింది. ఇరగదీసే బ్యాటింగ్.. ఆకట్టుకునే బౌలింగ్.. అన్నీ తోడై ఆల్ రౌండ్ పర్ఫామెన్స్ తో ఐపీఎల్ 2023 లో ఫస్ట్ విక్టరీ ని అందుకుంది. చెన్నై జట్టు ఇచ్చిన 218 పరుగుల భారీ టార్గెట్ లక్నో ఛేధించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేసింది. దీంతో.. 12 పరుగుల తేడాతో సీఎస్కే ఈ సీజన్‌లో తొలి విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే.. చివరి వరకు లక్నో జట్టు పోరాడి అందరి మనసుల్ని గెలుచుకుంది.

218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టుకు.. కైల్ మేయర్స్ దుమ్ము లేపే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 5.2 ఓవర్లలోనే లక్నో జట్టు 79 పరుగులు చేయలిగిందంటే.. కైల్ మేయర్స్ ఏ రేంజ్ లో చెలరేగాడో అర్ధం చేసుకోవచ్చు. మేయర్స్‌ 21 బంతుల్లోనే వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ కొట్టాడు. అయితే 5.3వ బంతికి మొయిన్‌ అలీ అతడిని ఔట్‌ చేసి బ్రేకిచ్చాడు. జట్టు స్కోరు 82 వద్ద దీపక్‌ హుడా (2)ను శాంట్నర్‌, రాహుల్‌ (20)ను మొయిన్‌ ఔట్‌ చేసి ఒత్తిడి పెంచారు. వికెట్లు పడుతున్నా 9.1 ఓవర్లకే లక్నో 100 చేసింది. 14 ఓవర్లకు 136/5తో నిలిచింది. నికోలస్‌ పూరన్‌ భీకరమైన షాట్లు ఆడి రన్‌రేట్‌ను అదుపులో ఉంచాడు. అతడు ఔటయ్యాక జట్టు స్కోర్‌ మళ్ళీ నెమ్మదించింది. మిగిలిన బ్యాట్స్ మెన్ లలో ఆయుష్‌ బదోనీ (23), కృష్ణప్ప గౌతమ్‌ (17*), మార్క్‌వుడ్‌ (10*) రాణించారు. ఇక చివరి ఓవర్లో 28 పరుగులు చేయాల్సిన క్రమంలో లక్నో బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో చివరి వరకు పోరాడిన లక్నోకి ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో మొయిన్‌ అలీ (4/26) లక్నోను కట్టడి చేశారు. అలీకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

అంతకు ముందు  బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. ఓపెనర్లు సీఎస్‌కేలో ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (57; 31 బంతుల్లో 3×4, 4×6), డేవాన్‌ కాన్వే (47; 29 బంతుల్లో 5×4, 2×6), శివమ్‌ దూబె (26; 13 బంతుల్లో 2×4, 2×6) దంచికొట్టి అద్భుత శుభారంభం అందించడం.. మధ్యలో అంబటి రాయుడు (27) మెరుపులు మెరిపించడం వల్ల.. చెన్నై జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. చివర్లో ధోనీ కొట్టిన రెండు సిక్సులు కూడా హైలైట్‌గా నిలిచాయి. వచ్చి రాగానే తొలి రెండు బంతుల్ని అతడు సిక్సర్లుగా మలచడంతో.. ఆ మైదానం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. మూడో బంతిని కూడా సిక్స్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు కానీ, క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో స్కోరు 217/7కు చేరుకుంది. సీఎస్కే ఆరంభాన్ని చూస్తే స్కోరు 240 దాటేలా కనిపించింది. కానీ మధ్యలో మరిన్ని ఎక్కువ పరుగులు రాబట్టడంలో చెన్నై బ్యాటర్లు కొంత మేర తగ్గారని చెప్పాలి. మొత్తానికి హోమ్ గ్రౌండ్ లో ఫ్యాన్స్ కి చెన్నై టీమ్ సూపర్ విక్టరీ ని అందించింది.