Published On:

IPL 2025 38th Match: రోహిత్, సూర్య మెరుపులు.. ముంబై సునాయస విజయం

IPL 2025 38th Match: రోహిత్, సూర్య మెరుపులు.. ముంబై సునాయస విజయం

Mumbai Indians won by Nine Wickets Against Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ముంబై మరో విజయం నమోదు చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ సునాయసంగా గెలుపొందింది. చెన్నై విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఒక్క వికెట్ నష్టపోయి ఛేదించింది.

 

తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్లు రషీద్(19), రచిన్(5), ధోని(4) విఫలమవ్వగా.. ఆయుషే మాత్రే(32), జడేజా(53), దూబె(50) రాణించారు. చివరిలో ఓవర్‌లో జడేజా సిక్స్, ఫోర్ కొట్టడంతో 170 పరుగులు దాటింది. ముంబై బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, అశ్వని కుమార్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.

 

176 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 15,4 ఓవర్లలోనే ఛేదించింది. మ్యాచ్ ప్రారంభం నుంచే ఓపెనర్లు దూకుడుగా ఆడారు. దీంతో పవర్ ప్లే చివర వరకు ముంబై 62 పరుగులు చేసింది. ఓపెనర్ రికిల్‌టన్(24) జడేజా బౌలింగ్‌లో ఔట్ అవ్వగా.. రోహిత్(76), సూర్యకుమార్ యాదవ్(68) మెరుపు ఇన్నింగ్ ఆడారు. రోహిత్ మరోసారి హిట్ మ్యాన్ ఇన్నింగ్స్ ‌తో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. సూర్య 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తయింది. దీంతో 26 బంతులు ఉండగానే ముంబై టార్గెన్‌ను ఛేదించింది. చెన్నై బౌలర్లలో జడేజాకు మాత్రమే వికెట్ దక్కింది.