Published On:

IPL 2025: నేడు గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ పోరు

IPL 2025: నేడు గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ పోరు

Gujarat Titans vs Mumbai Indians IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 55 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇందులో 2 మ్యాచ్‌లు మాత్రమే వర్షం కారణంగా రద్దయ్యాయి. ఒక్క మ్యాచ్ డ్రా కావడంతో సూపర్ ఓవర్‌ ఆడించారు. ఇవాళ 56వ మ్యాచ్‌ ముంబై వేదికగా జరగనుంది. వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో రాత్రి 7.30 గంటలకు ముంబై ఇండియన్స్ తలపడనుంది.

 

ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. ీ సీజన్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్‌లు ఆడగా.. 7మ్యాచ్‌ల్లో గెలిచి మిగతా 3 మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. అలాగే గుజరాత్ 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 7 మ్యాచ్‌లు గెలవగా.. 3 మ్యాచ్‌ల్లో ఓటమి చెందడంతో పట్టికలో 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది.

 

జట్టు అంచనా:

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, విల్ జాక్స్, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), శాంట్నర్, బౌల్ట్, బుమ్రా, కరణ్ శర్మ.

గుజరాత్‌ టైటాన్స్‌: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్, బట్లర్, సుందర్, షారుఖ్, రాహుల్ తెవాటియ, రషీద్, కోట్జి, సాయి కిశోర్, ప్రిసిద్ధ్ కృష్ణ, సిరాజ్, ఇషాంత్ శర్మ.