IPL 2025 43rd Match: చెన్నై, హైదరాబాద్ మధ్య కీలక పోరు.. ఎవరూ ఓడినా ఇంటికే..!

Chennai Super Kings Vs Sunrisers Hyderabad IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ 43వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నై నగరంలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. 6 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. ఇక, హైదరాబాద్ విషయానికొస్తే.. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌ల్లో ఓడగా.. 2మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ ఇరు జట్లు ప్లే ఆఫ్స్ చేరేందుకు మిగతా మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.
జట్టు అంచనా:
హైదరాబాద్: ట్రావిస్ హెడ్,అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిన్స్ (కెప్టెన్), అభినవ్ మనోహర్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ మలింగ.
చెన్నై: షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, ఆయుశ్ మాత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్, ధోని (కెప్టెన్), జేమీ ఓవర్టన్, అశ్విన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, పతిరణ.