IPL 2025: చెన్నై గ్రాండ్ విక్టరీ.. కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరేనా?

Chennai Super Kings, Kolkata Knight Riders IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి చెందింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లే ఆఫ్స్ వెళ్లాలంటే అద్బుతమూ జరగాలి. తర్వాతి మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఇతర టీం విజయాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్బాజ్(11) విఫలమైనా నరైన్(26), కెప్టెన్ రహానే(48), మనీష్ పాండే(36), రస్సెల్(38) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అలాగే రఘువంశీ(1), రింకూ సింగ్(9) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా.. జడేజా, కాంబోజ్ తలో వికెట్ తీశారు.
180 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నైకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ ఆయుష్ మాత్రే(0) డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కాన్వే(0) పెవిలియన్ చేరగా.. ఉర్విల్(31) ఆదుకునే ప్రయత్నం చేశాడు. అశ్విన్(8), జడేజా(19) బ్రెవిస్(52), శివమ్ దూబె(45), ధోని (17) పరుగులు చేశారు. చివరి ఓవర్లో 8 పరుగులు అవసరం ఉండగా ధోనీ సిక్స్ కొట్టడంతో మ్యాచ్ చెన్నై చేతిలోకి వెళ్లిపోయింది. 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లలో వైభవ్ 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా, వరుణ్ తలో 2 వికెట్లు, మొయిన్ అలీ ఒక్క వికెట్ తీశాడు.