Published On:

RCB Vs CSK: రాణించిన ఓపెనర్లు.. బెంగళూరు భారీ స్కోర్

RCB Vs CSK: రాణించిన ఓపెనర్లు.. బెంగళూరు భారీ స్కోర్

IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ముందుగా టాస్ ఓడిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ కు వచ్చింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి (62), జాకబ్ బెతెల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు. పవర్ ప్లే లో వీరిద్దరూ కలిసి 71 పరుగులు రాబట్టారు. ఇద్దరు పోటీపడి మరీ బౌండరీలు, సిక్సులు బాదుతూ.. పరుగుల వరద పారించారు. చివరిలో షెఫార్డ్ (14 బంతుల్లో 53) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. చెన్నై బౌలర్లలో మతీశ పతిరణ 3, సామ్ కరన్, నూర్ అహ్మద్ చెరో వికెట్ తీసుకున్నారు.

అయితే బెంగళూరు టీమ్ లో ఓపెనర్లు రాణించినప్పటికీ 9 ఓవర్లో కోహ్లీ, బెతెల్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ప్లేయర్లు అంతగా రాణించలేక పోయారు. పడిక్కల్ 17, పటిదార్ 11, జితేష్ శర్మ 7 పరుగులు మాత్రమే చేయడంతో.. బెంగళూరు జోరు తగ్గింది. దీంతో ఆర్సీబీ కనీసం 200 పరుగుల మార్కును చేరుకుంటుందా.. లేదా అనే సందేహం కలిగింది. చివర్లో రొమారియో షెఫర్డ్ చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆడిన ప్రతీ బంతి ఆకాశంలో పయనించడంతో చెన్నై బౌలర్లు తేలిపోయారు. కేవలం 14 బంతుల్లోనే 6 సిక్స్ లు, 4 ఫోర్లు బాది 53 పరుగులు చేశాడు. దీంతో ఆటముగిసే సమయానికి చెన్నై ముందు బెంగళూరు 214 పరుగుల టార్గెట్ ను ఉంచింది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలిగిన ధోనీ సేన టార్గెట్ ఛేజ్ చేస్తోందో లేదో మరి.