New Flight services : రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్.. ఏపీ నుంచి అబుదాబి వరకు కొత్త విమాన సర్వీసులు

Flight services from AP to Abu Dhabi : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విమానయాన శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకు త్వరలో కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్రవ్యాపంగా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విశాఖ-అబుదాబి మధ్య జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి వెల్లడించారు. విమాన సర్వీసులు వారానికి 4 రోజుల పాటు నడుస్తాయని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్నం-భువనేశ్వర్ విమాన సర్వీసు జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సర్వీసుల ద్వారా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని తెలిపారు. విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులు జూన్ 2 నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు. సర్వీసుల ద్వారా ఏపీ రాజధాని అమరావతి ప్రాంతాన్ని దేశంలోని ప్రధాన టెక్ హబ్‌లలో ఒకటైన బెంగళూరుకు అనుసంధానం కావొచ్చని తెలిపారు.